dasamahavidya-sadhana-poojanilayam
#దశమహావిద్య #అమ్మవారుల #అనుగ్రహమునకు
#దశమహావిద్య #కవచ #సాధన
మరిన్ని సాధనాలు కొరకు poojanilayam పేజీ ని చూడండి వ్యక్తిగత సాధనాలు కొరకు Poojanilayam పేజీ లో మెసేజ్ చేయండి దశమహావిధ్య మంత్ర, స్త్రోత్ర సాధనాలు ఒక్కోటికి పెడతాను,
మనం పొందే ఫలితాలు మనం చేసే సాధన తీవ్రత ని బట్టి ఉంటాయి
కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య, | కాలస్వరూపిణిగా ఖ్యాతిపొందిన శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా | శ్రీకాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల రోగాల నుంచి, బాధలనుంచి విముక్తి, ||శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి లభిస్తుంది.
దశమహావిద్యలలో రెండవమహావిద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈమెనే నీలసరస్వతి అనికూడా అంటారు. తారాదేవి సాధనవల్ల వాక్సిద్ధి, శత్రునాశనం, దివ్యజ్ఞానం, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి కలుగుతుంది.
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీ దేవి దశమహావిద్యలలో
మూడవ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమశాంతి స్వరూపిణి అయిన
లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు.
ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి
కష్టనష్టాలనుంచి విముక్తి, మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.
దశమహావిద్యలలో నాల్గవ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడోకన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని సమస్తసిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.
వేలసూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపురభైరవీ దేవి దశమహావిద్యలలో ఐదవ మహావిద్య. ఈ దివ్యశక్తి స్వరూపిణికి ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాలనుంచి, బాధలనుంచి విముక్తి, సకల సుఖభోగాలను పొందేశక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.
దశమహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండచండీ అనికూడా అంటారు. . ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కష్టతరమైన కార్యాలనైనా అవలీలగా సాధించేశక్తి ఈదేవి ప్రసాదిస్తుంది.
ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవి దశమహావిద్యలలో ఏడవ మహావిద్య. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అనిపేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్ఛాటనచేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి |ఆరాధనవల్ల సాధకుడికి వివిధ రోగాలనుంచి, శోకాలనుంచి విముక్తి కలుగుతుంది.
పీత (పసుపు) వర్ణంతో ప్రకాశించే శ్రీ బగళాముఖీదేవి దశమహావిద్యలలో
ఎనిమిదో మహావిద్య. స్తంభనదేవతగా ప్రసిద్ధి పొందిన ఈమహావి దేవతా ఉపాసన
వల్ల సాధకుడికి శత్రువుల వాక్కుని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా
కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటి పక్షం వారి మాటల్ని
స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.
మరకతశ్యామ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి దశమహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య. వశీకరణదేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్ఛిష్ట చండాలి, అనే పేర్లతో కూడా ఈదేవిని వ్యవహరిస్తారు. ఈదివ్య స్వరూపిణి ఉపాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.
పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశమహావిద్యలలో పదవమహావిద్యగా ప్రశస్తిపొందింది. సకలైశ్వర్య ప్రదాయిని అయిన కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్ధం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
ఇప్పటికే వేల సంఖ్యలో సాధకులు వాళ్ళ కామ్యాలు కొరకు ,దేవి దేవతల అనుగ్రహము కొరకు సాధనలు చేసి వాళ్ళ అనుభూతులు తెలిపారు ,సాధన తీవృత, నియమాలు ,నమ్మకం శ్రద్ధ ని బట్టి సాధకులు కి ఫలితాలు ఉంటాయి , కొందరికి సాధన చేసిన కొద్ది నెలలలో ఫలితాలు వస్తాయి, కొందరికి వాళ్ళ ప్రారబ్ధ కర్మ బట్టి చాలా ఆలస్యంగా అనుభూతి లోకి వస్తాయి కారణం ముందు వాళ్ళకి సాధన చేయగా చేయగా చెడు కర్మ నిర్ములన జరిగి మంత్రం అనుభూతి లోకి వస్తుంది
#Dasamahavidya
#Dasamahavidyas
#Dasamahavidyasadhanalu
కాళి మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు....