#మహాశక్తివంతమైన #కాళీ #మంత్ర# సాధన
కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించ వచ్చు. లోకంలో ఇది అసాధ్యం, చస్తే జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి.
ఇదెట్లా సాధ్యం అవుతుంది? కాళీ అనుగ్రహంతో కాల గతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మం అవుతుంది. అనేక జన్మల కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది.మహా కాళీ శక్తి కి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసన్నురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు.
మరిన్ని సాధనాలు కొరకు poojanilayam పేజీ ని చూడండి వ్యక్తిగత సాధనాలు కొరకు Poojanilayam పేజీ లో మెసేజ్ చేయండి దశమహావిధ్య మంత్ర, స్త్రోత్ర సాధనాలు ఒక్కోటికి పెడతాను
ఈ దశమహావిద్యలలో మొదటి విద్య అయిన కాళీ సాధన సకల రోగాల నుంచి, బాధల నుంచి విముక్తి శత్రునాశనం, దీర్గాయువు. సకలలోకలలో పూజత్వం , రాజ్యాధికారం , ఐశ్వర్యం,వాక్సుద్ధి , సాధకుడికి లభిస్తుంది.
ఈ మంత్రం
41 రోజులు రోజుకి ఉదయం 3 మాలలు సాయంత్రం మూడు మాలలు ,3 మాలలు అనగా 324 సార్లు నిష్ఠగా సూచి గా సాత్విక ఆహారం మానసిక నిష్ఠతో ఈ ఈ దశమహావిద్యలలో మొదటి విద్య అయిన కాళీ మంత్రం చేసిన
యెడల అద్భుతమైన ఫలితాలు పొందగలరు
మనం పొందే ఫలితాలు మనం చేసే సాధన తీవ్రత ని బట్టి ఉంటాయి
కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ దేవి ప్రీతిపాత్రమైనది. కాలస్వరూపిణిగా క్యాతి పొందిన శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉతృష్టమైనదిగా శాక్తేయ సంప్రదాయంలో చెప్పబడింది. శ్రీకాళి మహావిద్యని ఆరాధిస్తే సకల రోగాల నుంచి, బాధల నుంచి విముక్తి శత్రునాశనం, దీర్గాయువు. సకలలోకలలో పూజత్వం , రాజ్యాధికారం , ఐశ్వర్యంవాక్సుద్ధి , సాధకుడికి లభిస్తుంది.
ఈ దశమహావిద్యలలో మొదటి విద్య అయిన కాళీ దేవి
ఐశ్వర్యానికి అధిదేవత. ఐశ్వర్యం అంటే కేవలం సిరిసంపదలు మాత్రమే కాదు. ఐశ్వర్యం అంటే అధికారం (రాజ్యాధికారం), వైభవం కూడా. కాళి ని ఆరాధిస్తే ఆమె వీటన్నింటినీ అనుగ్రహిస్తుంది. అలా అమ్మవారిని అర్చించి, ఆమె కోసం తపస్సు చేసి విక్రమార్కుడు, భట్టి, నరకాసురుడు, తెనాలి రామకృష్ణ మొదలైనవారు ఐశ్వర్యాన్ని పొందారు.
ఈ దశమహావిద్యలలో మొదటి విద్య అయిన కాళీ అమ్మవారిని
ఎర్రతామరలతో విశేషించి ఎర్రకలువలతో (కాళీ సాధనలో కలువ పూలకు ప్రాధాన్యం) పూజిస్తే ఆమె ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. తామరగింజల మాలతో కాళీ మంత్ర జపం చేసి సిరిసంపదలను పొందవచ్చు.
కొందరికి ఇతరదర్శనాలు కూడా కలుగ వచ్చు.మరింత అదృష్టవంతులకు మరింత అదృష్టవంతులకు ఈ దశమహావిద్యలలో మొదటి విద్య అయిన కాళీమాత నిజదర్శనం కలుగవచ్చు.అది ఒక్కొక్కరి కర్మ పరిపక్వతను బట్టి, మానసిక పవిత్రతను బట్టి, మానసిక స్థాయిలను బట్టి ఉంటుంది. కాళీమాత దర్శనం కలిగితే అది తట్టుకోవటానికి చాలా చాలా సాధన కావాలి. అది అంత తేలికైన విషయం కానే కాదు.
జ్యోతిషవిజ్ఞానంలో శాక్తేయ పరిహారాలలో శనిభగవానుని పీడలకు ఈ దశమహావిద్యలలో మొదటి విద్య అయిన కాళీమాత
కాళీ ఉపాసన చక్కని ఉపాయం.కారణమేమంటే శని భగవానుడు యమునికి సంకేతం.యముడు కాలస్వరూపం.కాళిమాత కాలమునే సంహరించగలదు. కనుక శనిదశలో వచ్చే బాధలకు, ఏలినాటి శని మొదలైన గోచారబాధలకు కాళీ ఉపాసన శ్రేష్టం.కాని దీనికి ముఖ్యంగా నియమనిష్టలతో కూడిన జీవితం, అహంకారంలేని జీవితం గడపవలసి ఉంటుంది.అపుడే మాత అనుగ్రహం త్వరగా కలుగుతుంది.నియమం తప్పకుండా సాధన చేయవలెను.
కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య, | కాలస్వరూపిణిగా ఖ్యాతిపొందిన శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా | శ్రీకాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల రోగాల నుంచి, బాధలనుంచి విముక్తి, ||శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి లభిస్తుంది.
దశమహావిద్యలలో రెండవమహావిద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈమెనే నీలసరస్వతి అనికూడా అంటారు. తారాదేవి సాధనవల్ల వాక్సిద్ధి, శత్రునాశనం, దివ్యజ్ఞానం, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి కలుగుతుంది.
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీ దేవి దశమహావిద్యలలో
మూడవ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమశాంతి స్వరూపిణి అయిన
లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు.
ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి
కష్టనష్టాలనుంచి విముక్తి, మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.
దశమహావిద్యలలో నాల్గవ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడోకన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని సమస్తసిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.
వేలసూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపురభైరవీ దేవి దశమహావిద్యలలో ఐదవ మహావిద్య. ఈ దివ్యశక్తి స్వరూపిణికి ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాలనుంచి, బాధలనుంచి విముక్తి, సకల సుఖభోగాలను పొందేశక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.
దశమహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండచండీ అనికూడా అంటారు. . ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కష్టతరమైన కార్యాలనైనా అవలీలగా సాధించేశక్తి ఈదేవి ప్రసాదిస్తుంది.
ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవి దశమహావిద్యలలో ఏడవ మహావిద్య. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అనిపేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్ఛాటనచేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి |ఆరాధనవల్ల సాధకుడికి వివిధ రోగాలనుంచి, శోకాలనుంచి విముక్తి కలుగుతుంది.
పీత (పసుపు) వర్ణంతో ప్రకాశించే శ్రీ బగళాముఖీదేవి దశమహావిద్యలలో
ఎనిమిదో మహావిద్య. స్తంభనదేవతగా ప్రసిద్ధి పొందిన ఈమహావి దేవతా ఉపాసన
వల్ల సాధకుడికి శత్రువుల వాక్కుని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా
కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటి పక్షం వారి మాటల్ని
స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.
మరకతశ్యామ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి దశమహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య. వశీకరణదేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్ఛిష్ట చండాలి, అనే పేర్లతో కూడా ఈదేవిని వ్యవహరిస్తారు. ఈదివ్య స్వరూపిణి ఉపాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.
పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశమహావిద్యలలో పదవమహావిద్యగా ప్రశస్తిపొందింది. సకలైశ్వర్య ప్రదాయిని అయిన కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్ధం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
#Dasamahavidya
#Dasamahavidyas
#Dasamahavidyasadhanalu
#kalimata
#kalimataaadhana
కాళి మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు.