అతిశక్తివంతమైన పరబ్రహ్మ గోపాల మహాసుదర్శన మాలమంత్ర సాధన
(సర్వాభీష్ట సిద్ధికర
సర్వారిష్ట నివారక, కాలసర్పదోషనివారణ కోరుకు ,)
ఈ సాధన వలన కోరిన కోర్కెలు తీర్చుటలో దీనికిదేసాటి సకల బాధలు కష్టములు తొలగించి సర్వ సుఖములు ప్రాప్తిస్తుంది
ఉపాసనా క్రమము : ఈ సర్వారిష్ట నివారకము సర్వాభీష్ట సిద్ధికరమగు పరబ్రహ్మ గోపాల సుదర్శన మాలామంత్రము కోరిన కోర్కెలు తీర్చుటలో దీనికిదేసాటి. అనుష్టించదలచిన ఉపాసనాపరుడు శుచిగా, నియమ నిష్టలు ఆచరిస్తూ గృహమున లేక విష్ణు / నారసింహ లేక శ్రీకృష్ణ మందిర
మునగాని నిత్యము ఉదయము 108సార్లు, సాయంత్రము 108 సార్లు వంతున
70 రోజులు అనుష్టించిన మాలామంత్రము సిద్ధియగును మండలము (70) రోజులు పూర్తియైన తదుపరి రోజు 71వరోజున మహావిష్ణు లేక శ్రీకృష్ణ లేక లక్ష్మీనారసింహ లేక శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంభూ క్షేత్ర దర్శనము. నిద్రగావించిన మాలామంత్ర సిద్ధి, శుద్ధి యగుటేగాక తనను ఆవరించి బాధించుచున్న బాధలు నిర్వీర్యమగును. ఒకవేళ భయంకరమైన ఇతర క్షుద్ర దేవతల ప్రయోగాలు చే బాధపడిన యెడల ఉపాసనాపరుడు రెండుమండలములు (96రోజులు) కనీసము ధ్యానించి ఆ తదుపరి హోమాదులు, స్వయంభూ క్షేత్ర దేవతా దర్శనము, నిద్ర గావించిన ప్రయోగాదులు, అనారోగ్యము, భయంకర ఈతిబాధలు పూర్తిగ ఉపశమిస్తాయి. ఈ మంత్రమును ఉపాసించు సమయంలో కార్యము సమర్థవంతముగా సఫలీకృతమగుటకు, మిరియాలు (100గ్రా.) చేతబట్టి మాలామంత్రాన్ని జపించేది. ఉపాసనా నంతరము ఈ మిరియాలను మైల తగలకుండ ఉంచి రోజు తినవచ్చును. లేక ఇంట్లో వాడుకోవచ్చును.
గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి ఇలా చేయవచ్చు
చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి
#Poojanilayam