అతిశక్తివంతమైన హనుమా బీజ మంత్రసంపుటీ కరణ స్త్రోత్రం తో పాటు హనుమంతుడి ఉపాసనా రహస్యాలు - poojanilayam
అతిశక్తివంతమైన హనుమా బీజ మంత్రసంపుటీ కరణ స్త్రోత్రం తో పాటు హనుమంతుడి ఉపాసనా రహస్యాలు మరియు
హనుమాన్ 9 అవతారాలు అయిన 1 ప్రసన్నాంజనేయం 2. వీరాంజనేయుడు 3. వింశతి భుజాంజనేయుడు పంచముఖ ఆంజనేయుడు 5. అష్టాదశభుజ ఆంజనేయుడు 6. సువర్చలా సహిత ఆంజనేయుడు 7. ద్వాత్రింశద్భుజాంజనేయుడు 8. చతుర్భుజ ఆంజనేయుడు 9. వామనాకార ఆంజనేయుడు కోసం వివరణ
సాధన :- రోజుకి 9 సార్లు 41 రోజులు అద్బుతమైన ఫలితం వస్తుంది హనుమా అనుగ్రము కలుగుతుంది
హైందవులకు ముఖ్యమైన దైవములలో ఆంజనేయస్వామి కూడా ఒకరు. భవిష్య బ్రహ్మ అయిన ఈ పవనపుత్రుడు పిలిచినవారికి పలికే ప్రత్యక్ష దైవం అనటంలో సందేహం ఎంతమాత్రం లేదు. భూత, ప్రేత, పిశాచ, శాకినీ, ఢాకినీ, గాలి, దయ్యాలను పారద్రోలటంలో మారుతీకి ఉన్న మహత్తు మరెవ్వరికీ లేదు అనటంలో అతిశయోక్తి లేదు. తంత్రశాస్త్రంలో హనుమకు ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతాకాదు. క్షుద్ర ప్రయోగాలను తిప్పి కొట్టటంకోసం చేసే పూజలలో చేసే అష్టదిగ్బంధనములోని అష్టశక్తులలో ఆంజనేయుడు ఒకరు అని గ్రహించాలి. అతిశక్తివంతము, నిగూఢము అయిన ఆంజనేయ త్వాన్ని అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు
అపర రుద్రుడయిన హనుమకు 5 అనే సంఖ్య అంటే ఎంతో ప్రీతి అని తంత్ర గ్రంధాలు తెలియజేస్తున్నాయి. అందువలన హనుమాన్ జయంతి నాడు హనుమంతుని పూజించి స్వామికి 5 తమలపాకులు కానీ, ఒకే రకానికి చెందిన 5 పండ్లు కానీ, నేతి అప్పాలు కానీ సమర్పించి నట్లయితే విశేషమైన పుణ్యం లభిస్తుందని తెలుస్తున్నది హనుమకు పవనసుతుడు, మారుతి, బ్రహ్మజ్ఞాని, భవిష్యత్ బ్రహ్మ అనే పేర్లు ఉన్నాయి ఈ గ్రంధములో ఆంజనేయస్వామి అవతార విశేషాలను గురించి మరియు ఆంజనేయుని ఉపాసించే వివిధ రకాల తాంత్రిక విధానాలను గురించి మరియు ఆంజనేయ ఉపాసన చేసినవారు ప్రధానంగా దర్శించ వలసిన క్షేత్రముల గురించి చెప్పబడుచున్నది. అయ్యప్పదీక్ష తీసుకుని 40రోజుల పాటు కఠిన నియమాలను పాటించి ఆపై అయ్యప్ప కొండకి (శబరిమలై) వెళ్ళి తమ దీక్షను విరమించటం అయ్యప్ప భక్తులు తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ గ్రంధంలో చెప్పబడిన హనుమద్ ఉపాసనలు చేసినవారు
ఉపాసనలు ముగిసిన తరువాత ఇక్కడ పేర్కొంటున్న హనుమత్ క్షేత్రాలను దర్శించటం ముఖ్యం అని గ్రహించాలి.
ఆంజనేయ అవతార విశేషాలు: సృష్టి, స్థితి, లయ కారకులుగా చెప్పబడుతున్న త్రిమూర్తులలో ప్రధముడు శ్రీమహావిష్ణువు. ఆయనను ఎల్లప్పుడూ ధ్యానించే భక్తుడు పరమశివుడు. వారిద్దరికి విధేయుడుగా ఉండి సృష్టి కార్యక్రమాలను నిర్వహించేవాడు చతుర్ముఖుడు (బ్రహ్మ పురాణాలలో శివకేశవులకు భేదములేదు అని చెప్పబడి ఉన్నది. వారిద్దరు ఒకే నాణెమునకు రెండు ముఖములు వంటి వారని ఆధునిక వేదాంతులు చెబుతారు. ఏది ఏమైనా పురాణాలలో చెప్పబడిన సమాచారం ప్రకారం శ్రీమహావిష్ణువు భూలోకంలో మానవుడిగా అవతరించినపుడు ఆయనకు సహకరించటంకోసం ఈశ్వరుడు కూడా ఏదో ఒక అవతారాన్ని ఎత్తినట్టుగా తెలుస్తున్నది. నారాయణుడు త్రేతాయుగంలో శ్రీరామునిగా అవతరించినపుడు
రుద్రుడు ఆంజనేయునిగా ఆవిర్భవించాడు ఆంజనేయుని యొక్క మహత్యానికి ఋజువుగా ఒక సంఘటనను తెలియ జేస్తాను. అది ఏమిటంటే పూర్వం తారకాసురుడు అనే ప్రబలమైన రాక్షసుడిని సంహరించటానికి శివపార్వతుల కలయిక వలన జన్మించిన కుమారస్వామి తారకాసురుడిని చంపటానికి వెళ్లేముందు సాక్షాత్తు బ్రహ్మ దేవునిచే ప్రసాదించ బడిన పంచముఖ ఆంజనేయ మంత్రాన్ని జపించి అపారమైన భక్తులు పొందినట్టుగా తెలుస్తున్నది
రామభక్తునిగా, చిరంజీవిగా, అస్కలిత బ్రహ్మచారిగా, అపూర్వశక్తి
సంపన్నుడిగా పేరుపొందిన ఆంజనేయుడు ఈనాటికీ భారతదేశం-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక నిగూఢమైన ప్రదేశంలోని ఒక కదళీవనంలో (అరటి తోట) తపో ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడని తెలుస్తోంది. అతిశక్తివంతమైన హనుమాన్ త్రికరణశుద్ధిగా కొలిచిన వారికి తప్పనిసరిగా సుఫలితములు ఉంటాయని జ్ఞానులు నొక్కి వక్కానిస్తూ.
ఒకప్పుడు శివపార్వతులు కైలాస పర్వత సానువులలో మర్కట దంపతుల రూపం ధరించి సంభోగము జరుపుచుండగా పరమశివునికి వీర్యస్కలనము అయినది. అతితేజోవంతము, తీక్షణము అయిన పరమ శివుని వీర్యం యొక్క ఉష్ణోగ్రతకు తట్టుకోలేని పార్వతి ఆ వీర్యమును తన యోనినుండి జారవిడచినది. ఇలా జరుగుటకు వెనకాల ఒక దైవ రహస్యము ఉన్నదని గ్రహించాలి. అది ఏమిటంటే పూర్వం అంజన అనే ఒక వానర స్త్రీ తన భర్త అయిన కేసరితో కలసి వనవిహారము చేస్తూ దక్షిణ భారతదేశంలో చిత్తూరు జిల్లా ప్రాంతమునకు వచ్చినదట. ఆ ప్రాంతములోని సౌందర్యమునకు ముగ్గులు ఆ వానర దంపతులు అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఇలా కొంతకాలం గడిచాక అంజన తనకు మంచి పుత్రుడు జన్మించాలని ఆశతో ఆ ప్రదేశంలోని ఒక పర్వతం కూర్చుని శివుని గురించి తపస్సు చేయటం ప్రారంభించింది. ఆమె తపస్సు ఫలించింది. ఫలితంగా పార్వతీదేవి భరించలేక వదలివేసిన శివుని వీర్యాన్ని వాయుదేవుడు స్వీకరించి అంజనీ గర్భంలో ప్రవేశపెట్టాడు. ఆ విధంగా శివుని యొక్క వీర్యం అంజనా గర్భంలో పెరిగి ఆంజనేయునిగా ఒక శుభ ముహూర్తంలో భూలోకంలో జన్మించాడు
హనుమంతుడు వైశాఖమాసము, బహుళపక్షం, దశమి తిథి నాడు శనివారం, పగలు కర్కాటకలగ్నంలో పూర్వాభాద్రా నక్షత్రంలో అంజనా గర్భము నుండి ఆవిర్భవించినాడు. హనుమంతుడు పుట్టిన ఈ రోజు ప్రతి సంవత్సరమూ హనుమజ్జయంతి పాటించ బడుచున్నది హనుమంతుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో జన్మించాడు? అన్న విషయం గురించి విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి హనుమంతుడు చిత్తూరు జిల్లాలోని ఏడు కొండలలో ఒకటైన అంజనాద్రిపై జన్మించాడని కొందరు వాదించుచుండగా, మరికొందరు హనుమంతుడు
కర్నాటక రాష్ట్రంలోని హంపి ప్రాంతంలో ఉన్న ఆంజనేయ పర్వతంపై
జన్మించాడనీ ఈ పర్వతం పంపానది ఒడ్డున ఉన్న ఋష్యమూక పర్వతానికి
దగ్గరగా ఉన్నదనీ నొక్కి ఒక్కాణిస్తున్నారు బాల్యం నుండి మహా శక్తివంతుడైన ఆంజనేయుడు ఒకసారి గగనంలో ఉదయిస్తున్న ఎర్రటి సూర్య బింబాన్ని చూసి పండు అనుకుని భ్రమపడి
ఆకాశంలోకి రివ్వున ఎగిరి సూర్యుడిని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అయితే సూర్యుని వేడికి బాల హనుమంతుని మూతి ఎర్రగా కాలిపోయింది. సూర్యుడు, హనుమ గర్భంలోకి వెళ్ళిపోవటం వల్ల ముల్లోకాలలో చీకటి వ్యాపించింది. అవును నమస్తే దేవతల అభ్యర్థన మీద దేవరాజైన ఇంద్రుడు బాల హనుమంతుని వద్దకు పోయి అతనిని తన ప్రబలమైన వజ్రాయుధంతో కొట్టాడు. కఠినమైన ఆ వజ్రాయుధం బాల హనుమ దవడలు తాకింది. ఆ దెబ్బ ఫలితంగా అతడి దవడ పెద్దదైపోయింది. సూర్యుడు హనుమ ఉదరంనుండి బయటపడ్డాడు. (హనుమ అనగా దవడ (Jaw) అని అర్ధం) వజ్రాయుధ ధాటికి బాలుడైన హనుమంతుడు మూర్ఛపోయిన తన కుమారుడు ఇంద్రుడు చేతిలో దెబ్బతినటం చూసిన వాయుదేవుడు ఆగ్రహోదగ్రుడై హనుమను యెత్తుకుని ఒక కొండగుహలోకి వెళ్ళి నిరసన దీక్ష ప్రారంభించాడు. నీరులేకపోయినా బ్రతక గలముకానీ, గాలి లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేము. అలాంటి గాలికి ఆధారభూతుడైన వాయు దేవుడు స్తంభించిపోవటంతో ముల్లోకాలు గడగడలాడిపోయాయి ముఖ్యంగా భూగోళంమీద ఉన్న సమస్త జీవులు ఊపిరి ఆడక గిలగిల లాడిపోయాయి ఇదంతా చూసి కంగారు పడిన బ్రహ్మదేవుడు తన సృష్టిని రక్షించుకోవడం కోసం వాయుదేవుని వద్దకు వెళ్లి ఆగ్రహాన్ని తగ్గించుకుని వాయు ప్రసారం చేయమని ప్రాధేయపడ్డాడు. అంతేకాదు ఇక నుండి హనుమకు ఏ ఆయుధం వల్ల, ఏ దైవం వల్ల ఎలాంటి ప్రమాదము కలుగకుండా అనేక వరాలు ఇచ్చాడు అంతేకాకుండా ఇంద్రుడితో సహా సమస్త దేవతలు వచ్చి బాలహనుమకు అనేక వరాలు ప్రసాదించారు. ఆనాటి నుండి హనుమ ఎదురులేని వీరునిగా సర్వశక్తి సంపన్నుడిగా పేరుపొందాడు.
ఆంజనేయుడు, ప్రత్యక్ష నారాయణుడు అని పిలువబడే సూర్యభగవానుని వద్ద సమస్త వేదాలు, నవవ్యాకరణాలను నేర్చుకున్నాడని తెలుస్తున్నది కొన్ని పురాణాలలో లభిస్తున్న సమాచారం ప్రకారం ఆంజనేయుడు సూర్య దేవుని కుమార్తె అయిన సువర్చలను వివాహమాడాడని తెలుస్తున్నది
హనుమంతునికి జ్యేష్ఠ శుద్ధదశమినాడు సువర్చలాదేవితో కళ్యాణం జరిగిందని చెప్పబడుచున్నది. హనుమంతుని వాహనం ఒంటె అని తంత్ర గ్రంధాలు తెలియజేస్తున్నాయి. అందువలన కొన్ని హనుమాన్ ఆలయాలలో హనుమంతుని ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం పై ఒంటె యొక్క బొమ్మ ఉంటుంది. లేదా ద్వజస్థంభము బదులు ఒంటె బొమ్మకూడా ఉండే అవకాశం ఉన్నది
హిందూ తంత్ర గ్రంధాలలో ప్రధానమైనదిగా పేర్కొనబడుతుంది పరాశర సంహితలో హనుమకు సంబంధించిన అనేక విశేషాలు మరియు తాంత్రిక విధానాలు వివరంగా తెలియ చేయబడ్డాయి
హనుమంతుని ఆలయాలు దాదా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ నిర్మించబడి ఉన్నాయి. పిశాచాలను, క్షుద్రపీడలను తరిమి కొట్టే ఆంజనేయుని విగ్రహంలేని ఒక్క గ్రామం కూడా భారతదేశంలో ఉండదు అంటే అతిశయోక్తి కాదు
ఇంతవరకు అనేకమంది యోగులు ఆంజనేయుడిని దర్శించినట్లుగా
చెప్పబడుతున్నది. అలాంటి వారిలో 13వ శతాబ్దానికి చెందిన మధ్వాచార్యుడు వ శతాబ్దానికి చెందిన తులసీదాస్, 17వ శతాబ్దానికి చెందిన శ్రీరామదాసు స్వామి 17వ శతాబ్దానికి చెందిన రాఘవేంద్రస్వామి, 20వ శతాబ్దానికి చెందిన స్వామిరామదాస్ మరియు శ్రీ షిర్డీ సాయిబాబా ముఖ్యం అని తెలుస్తున్నది
ఆంజనేయుడు, శ్రీమహావిష్ణువు వలెనే అనేక అవతారాలను ధరించినట్టుగా తెలుస్తున్నది. హనుమంతుడు మొత్తం తొమ్మిది అవతారాలు
ధరించాడని పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఈ నవ అవతారాలు పేర్లు
ఇలా ఉన్నాయి.. 1 ప్రసన్నాంజనేయం 2. వీరాంజనేయుడు 3. వింశతి భుజాంజనేయుడు పంచముఖ ఆంజనేయుడు 5. అష్టాదశభుజ ఆంజనేయుడు 6. సువర్చలా సహిత ఆంజనేయుడు 7. ద్వాత్రింశద్భుజాంజనేయుడు 8. చతుర్భుజ ఆంజనేయుడు 9. వామనాకార ఆంజనేయుడు
1) ప్రసన్నాంజనేయుడిని
హనుమాన్ భక్తులు అధిక సంఖ్యాకులు ఈ ప్రసన్నాంజనేయుడిని ఆరాధించటం జరుగుతున్నది. ఈయన తన గదాదండాన్ని కింద ఉంచి ఒక చేత్తో అభయమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈయనకే అభయాంజనేయస్వామి అన్న పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
2)వీరాంజనేయుడు
శౌర్యానికి, వీరత్వానికి ప్రతీకగా దర్శనమిచ్చే ఈ స్వామి యుద్ధానికి సిద్ధముగా ఉన్నాడా అన్నట్టుగా కనిపించే భంగిమలో ఉంటాడు. ఈయన ఒకచేత్తో గదను భుజముపై పెట్టుకుని, ఇంకొక చెయ్యిని నడుముపై వేసుకుని ఒకకాలు ముందుకు చాచి దూకపోతున్నట్టుగా కనిపిస్తాడు చైత్రమాసంలో వచ్చే పుష్యమి నక్షత్రంలో వీరాంజనేయస్వామిని ఆరాధిస్తే ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయని తెలుస్తున్నది
3)వింశతి భుజ ఆంజనేయుడు : భవిష్యత్ బ్రహ్మగా పేరుగాంచిన ఆంజనేయుడు ఒకరూపంలో 21 హస్తాలను మరియు ఆ హస్తాలలో 21 ఆయుధాలను ధరించి ఉంటాడు. మహామహిమాన్వితమైన ఈ స్వామిని సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆరాధించినట్టుగా తెలుస్తున్నది.
4)పంచముఖ ఆంజనేయుడు : శ్రీ హనుమంతుడు సాక్షాత్తు రుద్రుని అవతారమని ఋజువుచేసే ప్రళయ భీకరమైన రూపమే పంచముఖ ఆంజనేయుడు
ఐదు శిరస్సులు, దశ హస్తములతో, దశ ఆయుధములతో కనిపించే ఈ స్వామిని ఆరాధించిన వారికి భూత, ప్రేత, పిశాచ బాధలు తొలగిపోతాయి. ఈ స్వామికి ఉన్న 5 శిరస్సులు 15 నేత్రములు ఉన్నాయి. అనగా త్రినేత్రునివలె పంచముఖ ఆంజనేయుడు కూడా ఒక్కో శిరస్సుకు మూడు నేత్రములను కలిగి ఉన్నాడు అన్నమాట
పంచముఖ ఆంజనేయుడు ఎలా అవతరించాడు అంటే
ఇంకా సంపూర్ణ వివరాలుగా తెలుసుకోడానికి #poojanilayam website చూడండి
రావణుని సవతి తమ్ముడైన మహిరావణుడు లేదా అహిరావణుడు లేదా అహిరావణుడు రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రామలక్ష్మణులను మోసంతో అపహరించి తన పాతాళరాజ్యానికి తీసుకువెళ్లి అక్కడ వారిని భద్రకాళికి బలి ఇవ్వాలని ప్రయత్నిస్తాను అహిహిరావణుడు మహాశక్తివంతుడు మాత్రమే కాకుండా క్షుద్ర ప్రయో గాలు చెయ్యటంలో ఆరితేరిన వాడు మరియు జిత్తులమారి క్రూరుడుకూడా అయి ఉన్నాడు అతడు తన పంచ ప్రాణాలను అయిదు తేనెటీగలు భద్రపరచి, ఆ తేనెటీగలను నరమానవులు ఎవ్వరూ చొరలేని ఒక పాతాళ గుహలోని బండక్రింద దాచి పెడతాడు. మహిరావణుని సంహరించటానికి ప్రయత్నించిన హనుమంతునికి మైరావణుడు యొక్క ప్రాణరహస్యం దేవతల ద్వారా తెలుస్తుంది. మైరావణుని సంహరించాలంటే అతని ప్రాణాలున్న 5 తేనెటీగలను పట్టుకుని ఒకేసారి సంహరించాలి. 5 తేనెటీగల లో ఏ ఒక్కటి తప్పుకున్నా మహిరావణుడు మరణించడు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఆంజనేయుడు తేనెటీగల ఉన్న ప్రాంతాలకు చేరుకుని పంచముఖాలతో ఆవిర్భవించి, బండక్రింద భద్రపరచిన 5 తేనెటీగలను ఏకకాలంలో తన 5 శిరస్సులకు గల నోర్లతో కొరికి చంపివేస్తాడు. ఎప్పుడైతే మహిరావణుని ప్రాణాలు ఉన్న తేనెటీగలు చని పోతాయో ఆ క్షణమే
మహిరావణుడు చనిపోయి నేలపై పడతాడు. ఆ తరువాత ఆంజనేయుడు రామలక్ష్మణులను పాతాళం నుండి భూమి మీదకు తీసుకుని వస్తాడు. మరల రామరావణ యుద్ధం ప్రారంభం అవుతుంది
తంత్రశాస్త్రంలో దశమహావిద్యల తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన తాంత్రిక దైవాలలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రధముడు తంత్ర శాస్త్రం పేర్కొంటున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆంజనేయులు యొక్క విశ్వరూపమే పంచముఖ స్వరూపమని తెలుస్తున్నది. ఈ పంచముఖ ఆంజనేయుడు శిరస్సులు ఉంటాయి. అవి వానర, నారసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ. ఈ అవతారంలో స్వామివారికి 10 చేతులు ఉంటాయి. ఈ 10 చేతులలో కత్తి, డాలు, అంకుశము, నాగలి, సర్పము, వృక్షము, మంచపుకోడు, పుస్తకము, అమృత కలశము అనే దశ ఆయుధములు ఉంటాయని తెలుస్తున్నది. ఈ స్వామి పంచముఖాలలో మొదటిదైన వానరముఖం తూర్పు దిక్కును చూస్తూ ఉండగా, ద్వితీయ ముఖం అనగా నారసింహ ముఖం దక్షిణం వైపు ఈ ంటుంది. మూడవది అయిన గరుడ ముఖం పశ్చిమంవైపు ఉంటుంది. ఇక నాల్గవది అయిన వరాహ ముఖం ఉత్తర దిక్కును చూస్తూ ఉంటుంది. ఇక ఐదవది అయిన హయగ్రీవ ముఖం (గుర్రపు తల) పైకి చూస్తూ ఉంటుంది.
దక్షిణ దిక్కులు చూసే నారసింహ శిరస్సు భక్తులకు విజయాలను నిర్భయత్వాన్ని ప్రసాదిస్తుంది. పశ్చిమ దిక్కును చూసే గరుడ శిరస్సు చేతబడులను విషాలను నిర్మూలిస్తుంది. ఉత్తర దిక్కునుచూసే వరాహ శిరస్సు సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పంచముఖాలలో మొదటిది అయినది అయిన వానరముఖం తూర్పు దిక్కును చూస్తూ ఉంటుంది. ఈ ముఖం భక్తులకు స్వచ్ఛమైన మనస్సును, విజయాన్ని ప్రసాదిస్తుంది. ఇక ఆకాశంవైపు చూసే హయగ్రీవ శిరస్సు మనకు కనపడకపోయినప్పటికినీ అది భక్తులకు జ్ఞానాన్ని మంచి సంతానాన్ని ప్రసాదిస్తుంది
5)అష్టాదశ భుజ ఆంజనేయుడు : సాక్షాత్తు దూర్వాస మహర్షిచే ఆరాధింప బడిన 18 హస్తములుగల ఈ స్వామి యొక్క మహత్యము వర్ణించుటకు వెయ్యి తలల గల ఆదిశేషుని కూడా సాధ్యం కాదు. ఈ స్వామి తన 18 హస్తములలో 18 రకముల ఆయుధములను ధరించి ఉంటాడు.
అష్టభుజ ఆంజనేయ శ్లోకాలు తగిన సంఖ్యలో పఠించినవారికి శతు జయం కలుగుతుందని ఆశించిన పొందగలుగుతారు తంత్ర శాస్త్రములు తెలియజేస్తున్నాయి.
6)సువర్చలా సహిత ఆంజనేయుడు : సూర్యుని యొక్క ఖండించబడిన తేజ రాశి నుండి ఉద్భవించిన దేవతా స్త్రీ సువర్చలాదేవి. ఈమెను ఆంజనేయుడు వివాహమాడినట్టుగా తెలుస్తున్నది. హనుమంతునికి వామభాగంలో ఆశీను లై సువర్చలా దేవి ఉంటుంది.
7)ద్వాత్రింశద్భుజాంజనేయుడు : హనుమంతుని యొక్క విశ్వరూపమును తెలిపెడి రూపములలో ఈ ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి అవతారము ఒకటి. ద్వాత్రింశ అనగా 32 అని అర్ధము. కనుక ఈ ద్వాత్రింశద్భుజాంజనేయ స్వామికి 32 హస్తములు ఉంటాయి. ఆ హస్తములలో స్వామివారు 32 విభిన్న ఆయుధాలు ధరించి ఉంటారు. సర్వరోగములను, మనో క్లేశములు తొలగించును
8) చతుర్భుజ ఆంజనేయుడు : శ్రీమహావిష్ణువు అవతారమని భావించబడు చున్న కపిల మహర్షి ఈ చతుర్భుజ ఆంజనేయస్వామిని ఆరాధించి సమస్య మంత్రశాస్త్రములను సాధించినాడు. ఈ స్వామికి నాలుగు హస్తాలు ఉంటాయి. ఈ స్వామి ఒకచేత్తో వరద ముద్రను, ఇంకొకచేత్తో అభయ హస్తమును ఇస్తారు. మూడవ చెయ్యిని తన అర్ధాంగి అయిన సువర్చల యొక్క స్థనద్వయంపై వేసి, నాల్గవ చేతితో ఆయనకు అత్యంత ఇష్టమైన అరటిపండును పట్టుకుని ఉంటారు. తంత్రశక్తులను సాధించాలనుకునేవారు ఈ చతుర్భుజ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.
9)వానరాకార ఆంజనేయుడు : సర్వసాధారణంగా అనేక ప్రదేశాలలో దర్శన మిచ్చే వానరాకార ఆంజనేయస్వామిని ఆరాధించినట్టయితే వివిధ రకాల అనారోగ్యాలు నయం అవుతాయని చెప్పబడుచున్నది. ఇటీవల కాలంలో హిమాలయ పర్వతాలలోని మానససరోవరం ప్రాంతంలో ఒకచోట తాళపత్ర రామాయణాన్ని పఠిస్తున్న వానరాకార ఆంజనేయుడు అనేక మందికి దర్శన మిచ్చినట్టుగా తెలుస్తున్నది.