జన్మ జాతక చక్రం లో రోగకారక గ్రహాలు కోసం వివరణ -మరియు ఆ గ్రహములు దోషములు యొక్క తీవ్రత ని దోషములు ని తాగించడానికి తాంత్రిక పరిహారాలు మరియు జాతక చక్రం లో రోగ కారక , పీడిత గ్రహాలు వలన వచ్చే రోగాలు కి మానసిక రుగ్మతలకి
సర్వరోగాలు నివారించే సంజీవని లాంటి మహా శక్తివంతమైన ధన్వంతరీ మంత్రం
మానవుల ఆరోగ్యాలపై ప్రభావం చూపించే గ్రహాలలో చంద్ర, కుజ, శని
గ్రహాలు ప్రధానమైనవిగా చెప్పాలి. కుజ గ్రహం భూమికి చాలా దగ్గరగా ఉంటుంది
అందువల్ల ఆ గ్రహ ప్రభావం మానవుల మీద చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు
జ్యోతిషశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే మనిషి శరీరం 12 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అంతరిక్షంలో ఉండే 12 రాశులకి ఈ 12 శరీర భాగాలతో ప్రత్యేక సంబంధం ఉంటుంది. ఈ రాశులకు అధిపతిగా ఉండే గ్రహాలు మానవుని శరీరంలోని 12 భాగాలు మీద ప్రభావాన్ని చూపిస్తాయి
ఒక వ్యక్తి జాతక చక్రంలో ఒక స్థానం (అనగా రాశి)లో ఉండే గ్రహం అశు భస్థితిలో ఉన్నట్లయితే ఆ రాశికి సంబంధించిన ఆ వ్యక్తి శరీర భాగంలో వ్యాధులు ఏర్పడతాయి
పుట్టిన ప్రతి జీవికీ ఏదో ఒక విధమైన అనారోగ్యం తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో వచ్చి తీరుతుంది. మనిషి విషయమూ అంతే. సాధారణంగా మానవులు తమకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుల సలహా మీద తగిన ఔషధాలను వాడి ఆరోగ్యవంతులు అవుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఎన్నిరకాల ఔషధాలు వాడినా రోగాలు తగ్గని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి సమయాలలో జ్యోతిష్కుల సహాయాన్ని తీసుకోవటం మంచిది. ఎందుకంటే కొన్నిరకాల రోగాలు గ్రహపీడల కారణంగా వస్తాయి
ఒక వ్యక్తి జాతక చక్రంలోని 6,8,12 వ స్థానంలో ఉండే గ్రహాల కారణంగా ఆ వ్యక్తి కొన్నిసార్లు రోగాలు వస్తాయి. ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క మహాదశ లేదా అంతర్గత జరిగే సమయంలో ఆ వ్యక్తికి కొన్నిరకాల రోగబాధలు ఏర్పడతాయి
విశేషం ఏమంటే ఒక వ్యక్తి యొక్క జన్మకుండలినిలోని 6వ స్థానం అతడికి వచ్చే రోగాలు మరియు అతనికి ఉండే శత్రువులు సూచిస్తుంది. ఈ 6వ స్థానం మీద చెడు గ్రహాల యొక్క దృష్టి పడ్డ లేదా 6వ స్థానంలో చెడు గ్రహాలు ఉన్నా ఆ వ్యక్తికి ఉండే శత్రువులు చాలా ఉన్నట్లయితే తక్కువగా ఉంటారు. కానీ 6వ స్థానంలో శుభగ్రహాలు వ్యక్తి శత్రువులు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఆ ఇంకొక విశేషం ఏమంటే 6వ స్థానాన్ని "ఉపచయస్థానం" అని పిలుస్తారు. ఈ
స్థానంలో ఉండే పాపగ్రహాలు బలహీనపడతాయి. అయితే ఈ స్థానంలో ఒకటికన్నా
ఎక్కువ చెడుగ్రహాలు ఉన్నట్లయితే జాతకుడికి విపరీతమైన హాని శత్రువుల వల్ల లేదా
రోగాలవల్ల కలిగే అవకాశాలు బలంగా ఉంటాయి.
ఒకవ్యక్తి జాతకచక్రంలోని 3 మరియు 6వ స్థానాలలో ఉండే శుభ గ్రహాలు విపరీతమైన శక్తిని కలిగి ఉండగా, ఈ స్థానాల్లో ఉండే పాపగ్రహాలు తీవ్రంగా బలహీనపడతాయి. సాధారణంగా ఒక వ్యక్తి జాతకంలోని రవి మరియు చంద్రుడు శుభస్థితులలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి చాలావరకు ఆరోగ్యవంతుడుగానే ఉంటాడు కొంతమంది జ్యోతిషశాస్త్ర పండితుల అభిప్రాయం ప్రకారం ఒకవ్యక్తి జాతకంలోని
1వ స్థానాల్లో ఉండే పాపగ్రహాలు మరియు 3,6,8, 12వ స్థానాల్లో ఉండే
శుభగ్రహాలు ఆ వ్యక్తి వచ్చే రోగాలు అధికం అవటానికి కారకులు అవుతాయని
తెలుస్తున్నది మానవుల జన్మకుండలినిలోని సూర్యుడు వారి ఆరోగ్యానికి కారకుడు అవుతాడు ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నా వ్యక్తి జీవితాంతమూ ఆరోగ్యము సరిగా ఉండదు లేదా అశుభస్థితిలో ఉన్నా ఆ
జ్యోతిషశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని అంచనా వెయ్యటానికి ముఖ్యంగా తీసుకోవలసింది ఆ వ్యక్తి యొక్క జన్మకుండలినిలోని లగ్నాన్ని ఆ వ్యక్తి జాతకంలోని లగ్నాధిపతి యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తి వచ్చే రోగాలు లేదా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి నిర్ణయమవుతుంది. బలహీన లగ్నాధిపతి, కేంద్ర లేదా త్రికోణ స్థానాలు ఉన్నట్లయితే ఆ జాతకుడు జీవితాంతము ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా ఒక జాతకంలో లగ్నం - మేషం, మిధునం కన్య, వృశ్చిక రాశిలో ఉంది మరియు ఆ రాశి ఆ జాతకుని యొక్క 6వ స్థానం అయినట్లయితే ఆ జాతకుడు జీవితాంతము ఏదోఒక అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది
మానసిక రోగాలకు కారణమయ్యే గ్రహస్థితులు
చంద్రుడు మానవుల మనస్సుకి అధిపతిగా ఉంటాడు. ఒక వ్యక్తి యొక్క
జాతకంలోని చంద్రుడు చెడు పరిస్థితుల్లో ఉన్నట్లయితే (శత్రు స్థానంలో నీచస్థానంలో ఉన్న చంద్రుడు) ఆ వ్యక్తి మానసిక సంబంధమైన రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
శారీరక వ్యాధులు చాలావరకు పైకి కనిపిస్తాయి. కానీ మానసిక వ్యాధులు
కనపడవు. అయితే ఆ వ్యాధులు వచ్చినవారు పడే బాధ చెప్పటానికి మాటలు
చాలవు. హిస్టీరియా, మూర్ఛలు లాంటి మానసిక వ్యాధులకు కారణమయ్యే
గ్రహస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం
ఒకవ్యక్తి జాతకంలోని కేంద్రస్థానంలో శని మరియు చంద్రుడు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడికి మానసిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవ్యక్తి జాతకంలోని సప్తమస్థానంలో చంద్రుడు ఒక పాపగ్రహంతో కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడు మానసిక రుగ్మతలకు గురి అవుతారు
ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలోని 6వ స్థానంలో చంద్ర, శని, రాహువులు
కలిసి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మానసిక సంబంధ రోగాలు వచ్చే సూచనలు ఉంటాయి.
ఒకవ్యక్తి జాతకంలోని లగ్నంలో గురువు, సప్తమస్థానంలో శని ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఉన్మాదవ్యాధికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక వ్యక్తి యొక్క జన్మకుండలినిలోని 12వ స్థానంలో బలహీనమైన చంద్రుడు, శనితో కలిసి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మానసిక రోగాలు వస్తాయి
ఒకవ్యక్తి జన్మకుండలినిలోని అష్టమ స్థానాధిపతి, శుక్ర మరియు చంద్రులతో కలిసి ఆ జాతకంలోని 6/8/12వ స్థానాల్లో ఉన్నట్లయితే ఆ వ్యక్తి మానసిక రుగ్మతలకు గురిఅయ్యే అవకాశాలు ఉంటాయి
ఆ జాతకంలో బుధుడు చెడుస్థితిలో ఉన్నట్లయితే ఆ జాతకుడికి నరాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ఒకవ్యక్తి జాతకంలోని 6వ స్థానంలో బలహీనుడైన బుధుడు, కుజుడు లేదా శనితో కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడు జీవితాంతము బలహీనుడిగా మిగిలిపోతాడు
ఒకవ్యక్తి జాతకంలోని లగ్నాధిపత్యాన్ని పొందిన శుక్రుడు ఆ జాతకంలోని 6వ స్థానంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి క్షయ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఒకవ్యక్తి జాతకచక్రంలోని 6,8,12 వ స్థానంలో ఉండే శుభగ్రహాలు బలహీనం అవుతాయి. కానీ ఆ స్థానంలో ఉండే పాపగ్రహాలు మరింత శక్తివంతం అవుతాయి. ఈ స్థానాల్లో ఉండే పాపగ్రహాలు ఎముకలు, కండరాలు, చర్మం, వీర్యం, నరాలకు సంబంధించిన వ్యాధులకు కారణం అవుతాయి. ముఖ్యంగా 6,8,12 స్థానాల్లో ఉండే శని, శుక్ర, కుజ, గురు, బుధ మరియు రవి గ్రహాలు పైన పేర్కొన్న రోగాలకు ప్రధాన కారణం అవుతాయి
ఒకవ్యక్తి జాతకంలోని అష్టమభావంలో రాహువు మరియు గురువు ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి
హృదయ(హార్ట్) సంబంధ వ్యాధులకు కారణమయ్యే గ్రహస్థితులు : ఈ రోజుల్లో అనేకమందికి హృదయ సంబంధమైన రోగాలు వస్తున్నాయి. ఒక వ్యక్తి జాతకంలోని 6 మరియు 4వ స్థానాల్లో ఉండే పాపగ్రహాల ప్రభావం వల్ల ఆ వ్యక్తి గుండె సంబంధమైన రోగాలు వస్తాయని గుర్తించాలి. గుండెజబ్బులకు
కారణమయ్యే గ్రహస్థితి జాతకచక్రంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం
ఎ) ఆత్మకారకుడైన రవికి 6వ స్థానాధిపత్యం రావటం లేదా ఆ జాతకంలోని 4వ స్థానంలో రవి, ఇతర చెడుగ్రహాలతో కలిసి ఉండటం
బి) ఒక జాతకంలోని 6వ స్థానాధిపత్యం శని లేదా గురువుకి ఉండి మరియు ఈ గ్రహాలు 4వ స్థానంలో ఇతర చెడుగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడికి గుండె సంబంధమైన జబ్బులు వచ్చే అవకాశాలు బలంగా ఏర్పడతాయి
ఆయుష్ కారకుడైన శని ఒక జాతకంలోని 4వ స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకుడికి గుండె సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి
ఒక జాతకంలో 6వ స్థానంలో ఉన్న శని మీద రవి/కుజ/రాహు గ్రహాలయొక్క దృష్టి పడినట్లయితే ఆ జాతకుడికి గుండె సంబంధ రుగ్మతలు వచ్చే అవకాశాలు బలీయంగా ఉంటాయి
ఒక వ్యక్తి జాతకంలోని ధనిష్టా నక్షత్రంలో శని ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆస్తమాలాంటి శ్వాససంబంధమైన సమస్యలు ఏర్పడతాయి
మానవుల ఆరోగ్యంపై శని ప్రభావాలు
శనీశ్వరుడిని "మారక అధిపతి" అనగా మృత్యుకారకుడు అని పిలుస్తారు ఒక వ్యక్తి జాతకంలో శని మహాదశ లేదా అంతర్దశ జరుగుతున్న సమయంలో వ్యక్తి మరణం సంభవించే అవకాశం ఉంటుంది. ఒకవ్యక్తి జాతకంలోని శని రాహు గ్రహ నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిషం ఉన్నా లేదా రాహువు, శని గ్రహం. నక్షత్రాల పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర ఉన్నా ఆ వ్యక్తి పక్షవాతం ఏదో ఒక సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఇతర శుభగ్రహాల బలం అధికంగా ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. అందువల్ల జాతకుడికి మరణం రాకపోయినప్పటికీ మృత్యుభయం ఏర్పడి గజగజ వణికిపోయారు దీనినే "అపమృత్యుభయం” అని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న జాతకులు ఒక నల్లటి అవును దూడతో సహా ఒక సదాచారపరుడైన పండితుడికి దానం ఇవ్వాలి. ఒక ముఖ్య విశేషం ఏమంటే ఇలా దానం ఇచ్చే ఆవు, దాన సమయంలో పాలను ఇస్తూ ఉండాలి. అలా ఇవ్వటంవల్ల శనిపీడ తొలగిపోయి చక్కటి ఆరోగ్యం తప్పనిసరిగా లభిస్తుంది
ఇలా గోదానం ఇచ్చే శక్తి లేనివారు పెద్ద ఉసిరికాయ మొక్కను రేవతీ నక్షత్రం
జరిగే రోజున ఒక మంచి ప్రదేశంలో భూమిలో నాటాలి. ఇలా చేసినట్లయితే శని దేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆయుర్దాయం పెరుగుతుంది. అయితే ఒక పండితుడి మంత్ర పఠనంతో ఈ ఉసిరికాయ మొక్కను నాటే ప్రక్రియను చెయ్యవలసి ఉంటుందని గ్రహించాలి
జన్మకుండలిని విశ్లేషణ ద్వారా రోగనివారక గ్రహ దోష పరిహారాలు ఒకవ్యక్తి ఆరోగ్యవంతుడుగా ఉండాలంటే మొదట అతడి లగ్నాధిపతి మరియు
ఆ లగ్నానికి యోగకారకుడైన గ్రహం బలంగా ఉండాలి. రత్నధారణ కోసం లగ్నాధిపతి
మరియు ఆ లగ్నానికి యోగకారకుడైన గ్రహం యొక్క స్థితిగతులను అంచనా వేయాలి. ఒకవ్యక్తి జాతకంలోని లగ్నానికి యోగకారకుడైన గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి రోగ బాధ ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఆ వ్యక్తి జాతకంలోని యోగకారకగ్రహంయొక్క బలం పెరగడం కోసం ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించాలి. ఈ రత్నధారణవల్ల యోగకారక గ్రహం యొక్క బలం పెరిగి ఆ గ్రహం జాతకుడికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
రోగనివారణకు రత్నధారణకూడా ఉపయోగపడుతుందని జ్యోతిషశాస్త్రం తెలియజేస్తుంది. అయితే జన్మకుండలిని నిశితంగా పరిశీలించిన తరువాతే ఏ రత్నాన్ని ధరించాలో నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయం ఎలా చెయ్యాలంటే?.. సాధారణంగా పాపగ్రహంయొక్క మహాదశ జరుగుతున్నప్పుడు జాతకుడికి రోగబాధతోపాటుగా అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. అలాంటి సమయంలో
ఆ జాతకుని లగ్నాధిపతి యొక్క బలం పెరగడం కోసం ఆ గ్రహానికి సంబంధించిన
రత్నాన్ని ధరించాలి. లగ్నాధిపతి బలం పెరిగినట్లయితే మహాదశాధిపతి అయిన
పాప గ్రహం ఇచ్చే చెడుఫలితాన్ని ఎదుర్కొనే శక్తి జాతకుడికి ఏర్పడుతుంది. (ఒక గ్రహం కారణంగా రోగి బాధ ఏర్పడినప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించమని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఇది చాలా పొరపాటు అని గుర్తించాలి. ఎందుకంటే రోగి కారకమైన గ్రహానికి మరింత బలాన్ని ఇచ్చే రత్నాన్ని ధరించటంవల్ల ఆ గ్రహం మరింత శక్తివంతమై రోగబాధను అనేకంట్లుగా పెంచుతుంది.)
గ్రహాల కారణంగా వచ్చే రోగాలను తగ్గించుకోవటం కోసం
కొన్నిరకాల తంత్ర మూలికలు పరిహారాలను క్రింద తెలియచేసాను .
అవి ఏమిటంటే మంత్రం, తంత్రం, ధ్యానం మరియు గ్రహ సంబంధ ఔషధ మూలికలు ప్రతి గ్రహానికి ఒక ఔషధ మూలికతో ప్రత్యేక సంబంధం ఉంటుంది. ఏ గ్రహం కారణంగా ఒక అనారోగ్యం వచ్చిందో ఆ గ్రహానికి సంబంధించిన ఔషధ మూలికను, ఆ గ్రహానికి సంబంధించిన రోజున ధరించాలి. ఔషధాలకు మరియు
గ్రహాలకు సంబంధం ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెప్తుంది
గ్రహాల కారణంగా వచ్చిన రోగాలను తగ్గించుకోవటానికి ఏ ఔషధ మూలికను ధరించాలో తెలుసుకోవటంకోసం రోగి యొక్క జన్మకుండలిని పరిశీలించాలి. పీడిస్తున్న గ్రహానికి సంబంధించిన ఔషధమూలికను జన్మ పత్రిక విశ్లేషణ ద్వారా తెలుసుకోవాలి.
హిందూ మతంలో ఔషధాలకు మరియు ఆరోగ్యానికి అధిదేవతగా భావించబడే ధన్వంతరీ అనే దైవం యొక్క మంత్రాన్ని ఇక్కడ ఇస్తున్నాను. దానిని 180000 సార్లు జపిస్తే మంత్ర సిద్ధి కలుగుతుంది. ఈ మంత్రసిద్ధి పొందితే మంచి ఆరోగ్యము మరియు ఆయుర్ధాయము లభిస్తాయి. చేతిలో అమృతంతో నిండిన కుండను పట్టుకుని ఉండే ధన్వంతరి ఈ ప్రపంచాన్ని సమస్త రోగాలనుండి కాపాడు తుంటాడు. ఈ మంత్ర సిద్ధి పొందిన వ్యక్తి ఈ మంత్రంతో అభిమంత్రించిన తీర్ధాన్ని మూడు రోజుల పాటు ఏ కైనా ఇచ్చనట్లయితే ఆ రోగికి అతి త్వరలో రోగం తగ్గిపోతుంది.