మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం
గండభేరుండ నరసింహ సాధన
సాధన :- రోజుకి 324 సార్లు 41 రోజులు చేయండి
శ్రద్ద ,మానసిక నిష్ఠ, తో చేయండి
గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి ఇలా చేయవచ్చు
చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి
అతిరహస్యము మరియు అత్యంత శక్తివంతము అయిన గండభేరుండ నరసింహ సాధన :- గండభేరుండ నరసింహ ఎనిమిది శిరస్సులతో ఉంటాడు. ఆ శిరస్సులు ఏమిటీ అంటే...
1.గండభేరుండ పక్షిరాజు : స్వామి ఈ శిరస్సుతో శరభేశ్వరుడిని మరియు అతని భార్యలు- యుద్ధంలో ఓడించాడు. ఈ ముఖాన్ని తత్సబంధిత మంత్రంతో ఆరాధించినట్లయితే అభిచార ప్రయోగాలు (చేతబడులు) మరియు క్షుద్రశక్తుల వలన కలిగే పీడలు దహనం అయిపోతాయి
2.నరసింహ మృగరాజు : శరభేశ్వరునికి సంబంధించిన వీరభద్రుడు, అఘోరా మరియు ఇతర అస్త్రమూర్తులను ఈ శిరస్సు లొంగదీసింది. ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే సమస్త రోగాలు నిర్మూలించబడి మంచి ఆరోగ్యం లభిస్తుంది
3.మహావ్యాగ్ర: ఈ శిరస్సు శివ సంబంధమైన నంది, గణపతి మరియు ఇతర శివ దేవతలను శరభేశ్వరునితో సహా అణచివేసింది. ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే దేవతల నుంచి, దయ్యాల నుండి, ప్రకృతినుండి, మానవులనుండి లభించే అన్ని రకాల ప్రమాదాలు నివారించ బత్తాయి
4.హయగ్రీవ : ఈ శిరస్సును తత్ సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే అన్ని శాస్త్రాలలో నైపుణ్యం కలిగి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది
5.ఆదివరాహ :- ఈ ముఖాన్ని తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. మంచిభార్య, పుత్రులు లభిస్తారు. ఊహించని సంపదలు ప్రసాదించబడతాయి
6.అఘోరా వానరేంద్ర : ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే మన గ్రహ బాధలు తొలగిపోయి షట్కర్మ ప్రయోగంలో (అభిచార ప్రక్రియలు)
మంచి నైపుణ్యం లభిస్తుంది
7.మహా గరుడ : ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే నాగ దోషం, నాగ భయం, విషభయం, పితృదోషాలు నివారణ అవుతాయి
8.భల్లూక : ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే షోడశ అనగా 16 సిద్ధులు లభిస్తాయి
అయితే గండభేరుండ నరసింహునికి ఈ ఎనిమిది ముఖం కాకుండా గూఢమైన మరియు ఎవరికీ కనపడని తొమ్మిదవ ముఖం కూడా ఉన్నదని దానిని బడబానల ముఖమని పిలుస్తారు. ఆ ముఖం ఆదినారాయణునికి చెందియున్నది. ఎవరైతే మహావిష్ణువుకు అతి దగ్గర అవుతారో వారికి గండ భేరుండ నరసింహునికి చెందిన తొమ్మిదవ శిరస్సుకూడా కనిపిస్తుందని ఋషులు తెలియజేస్తున్నారు