Skip to main content

రాత్రి సమయాలలో ఈ నాటికీ రాధా కృష్ణులు , సంచరిస్తున్న “నిధివన్" క్షేత్రము కోసం సంపూర్ణముగా - poojanilayam

రాత్రి సమయాలలో ఈ నాటికీ రాధా కృష్ణులు , సంచరిస్తున్న “నిధివన్" క్షేత్రము కోసం సంపూర్ణముగా
ఈ “నిధివన్” అనే ఆలయం పేరు - "నిధి” (నిద్ర) మరియు “వన” (అడవి) అనే రెండు పేర్ల కలయికతో ఏర్పడింది. అనగా, ఈ అరణ్యంలో రాత్రిపూట నిద్ర ఉండదని, ఈ ప్రాంతంలో రాధాకృష్ణులు మరియు గోపికలు - మెళుకువతో ఉండి రాసలీల సాగిస్తారని భావిస్తారు. నిగూఢమైన మర్మాలతో కూడి ఉన్న ఈ “నిధివన్ ఆలయం, బృందావన్ పట్టణ మధ్యభాగంలో ఉన్నది. మొదట, బృందావన్ పట్టణం గురించి తెలుసుకుని ఆ తరువాత అక్కడ ఉన్న “నిధివన్" ఆలయం గురించి చెప్పుకోవలసి ఉంటుంది
ప్రాచీనకాలంలో ఈ పట్టణాన్ని “బృందావనము” అనే పేరుతో పిలిచారు. బృంద (తులసి) అని, వన అనగా వనం లేదా అరణ్యం అని అర్ధం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక దట్టమైన అడవిగా ఉన్న బృందావనం ఈనాడు అనేక వేల యాలకు నిలయంగా మారింది. ఫలితంగా, రోజుకి కొన్ని వేల మంది హిందూ భక్తులు ఈ పట్టణానికి వచ్చి, ఆపై ఇక్కడ ఉన్న అనేక ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఒకవిశేషం ఏమంటే, బృందావన్ పట్టణంలోని ప్రతి సందులోనూ ఒక ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రంలో దాదాపుగా 5500 ఆలయాలు ఉన్నట్లు తెలుస్తోంది



ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావన్ పట్టణాన్ని "వితంతువుల నగరం" అని పిలుస్తారు. అందుకు కారణం ఏమంటే, భర్త చనిపోయిన మరియు విపరీతమైన దైవభక్తి గల స్త్రీలు - ఈ బృందావనానికి వచ్చి స్థిరపడి, ఆపై ప్రతిరోజూ ఈ ప్రాంతంలో ఉన్న వివిధ ఆలయాలను దర్శించుకుంటూ తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. ఒక విశేషం ఏమంటే, ప్రస్తుతం ఈ బృందావనంలో దాదాపు 20వేల మంది వితంతు స్త్రీలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. వీళ్ళు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడిన హిందూ స్త్రీలు అని గుర్తించాలి నిధివన్ ఆలయము మహాద్భుతమైన మాహాత్యంగల “నిధివన్" లేదా “నిధి వనం" అనే పేరుగల ఒక శ్రీకృష్ణ ఆలయం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో ఉన్న "బృందావనం" అనే పట్టణంలో ఉన్నది. దట్టంగా వ్యాపించి ఉన్న అరణ్యం మధ్యలో ఈ “నిధివన్" ఆలయం ఉన్నది. ఈ ఆలయం పసుపు రాయితో నిర్మించబడింది. ఈ ఆలయం చుట్టు ప్రక్కల ప్రాంతంలో 'వనతులసి' చెట్లు (బాసిల్ ట్రీ స్) విస్తారంగా కనిపిస్తాయి దట్టమైన చెట్లతో కూడిన అరణ్యం చుట్టూ నిర్మించబడిన ఒక గోడ ఉంటుంది. ఆ గోడ లోపలవైపు ఉండే అరణ్యం మధ్యభాగంలో ఈ నిధివన్ ఆలయం నిర్మించబడింది. నిధివన్ ఆలయం చుట్టూ కట్టబడిన ప్రహరీగోడ చాలా ఎత్తుగా ఉంటుంది. దాని యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం, 20 అడుగుల ఎత్తులో, ఒక రాజకోట ప్రవేశ ద్వారం లాగా చాలా బలిష్టంగా ఉంటుంది. ఒక విశేషం ఏమంటే, నిధివన్ ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీకి ఎత్తైన ప్రవేశ ద్వారం మరియు నిష్క్రమణ ద్వారం ఉంటాయి. ఈ ద్వారం దాటి లోపలికి వెళ్ళిన క్రిందకు వెళ్లే మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల గుండా క్రిందకు వెళితే అక్కడ ఒక అరణ్యం కనిపిస్తుంది. ఆ అరణ్యంలో ఎత్తు తక్కువగా ఉండి మరియు ఒకదానిని ఒకటి పెనవేసుకున్న “వన తులసి చెట్లు" కనిపిస్తాయి. ఈ చెట్లు రాత్రి సమయంలో గోపికలుగా మారతాయని చెప్పుకుంటారు. ఈ ప్రాంతంలో ఉన్న తులసి చెట్టు ఉన్న ఆకులను కోసినవారికి త్వరలోనే తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుందని చెప్పుకుంటారు. అందువలన, ఎవరూ కూడా ఈ తులసి చెట్లు ఉన్న ఆకులను కోయటానికి మాత్రం సహించరు

ఈ క్షేత్రంలో, రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు తన ప్రియురాలైన రాధ మరియు ఇతర గోపికలతో కలిసి ఆడి, పాడతాడని చెబుతారు. ఈ కార్యక్రమాన్ని 'రాసలీల అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షేత్రంలో పూజలందుకునే శ్రీకృష్ణుడిని "బాంకే బిహారి అనే పేరుతో పిలుస్తారు. "బన్-కీ-బిహారి (భన్ కీ బిహారి" అనగా వనంలో “వివరించేవాడు” అని అర్థం

ఈ ఆలయం లోపలి భాగంలో శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి యొక్క విగ్రహాలు ఎంతో అద్భుతంగా అలంకరించబడి ఉంటాయి. నిధివన్ ఆలయానికి ఎదురుగా ఒక చిన్న బావి ఉంటుంది. ఈ బావిని "లలితకుండం" అనే పేరుతో పిలుస్తారు ఒకప్పుడు రాధాదేవికి విపరీతమైన దాహం వేసిందని, ఆపై ఆమె దాహం తీర్చడం కోసం శ్రీకృష్ణుడు తన పిల్లనగ్రోవితో ఆ బావిని త్రవ్వాడని చెప్పుకుంటారు

ఇతర, ఏ హిందూ ఆలయాలు రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటాయి. అదేవిధంగా, ఆ ఆలయాల పరిసరాలలో భక్తులు, రాత్రి సమయంలో నిద్ర పోవచ్చు. కానీ, సాయంత్రం 5.30 దాటిన తరువాత ఏ వ్యక్తి నిధివన్ ఆలయం లోపల ఉండనివ్వరు. ఈ నిధివన్ ఆలయం లోపలికి రాత్రి సమయంలో మనిషి అనేవాడు ప్రవేశించడు. అంతేకాదు, ఈ ఆలయ ప్రహరీ లోపలి భాగంలోకి కూడా ఎవరు ప్రవేశించారు
రాత్రి 7 గంటల సమయంలో శ్రీకృష్ణుడికి సాయంత్రం హారతి ఇచ్చిన తరువాత ఈ ఆలయం యొక్క తలుపులు మరియు ఈ ఆలయం చుట్టూ ఉండే ప్రహరీ గోడకు ఉండే ప్రవేశ ద్వారం తలుపులు మూసివేయబడతాయి. ముఖ్యంగా, ప్రవేశ ద్వారానికి బలమైన తాళాలు వేయబడతాయి. భక్తులు గాని, ఆ ఆలయంలో పనిచేసే పూజారులుగా రాత్రి 7 గంటలు దాటిన తరువాత ఆ ఆలయం బైటగాని, ఆ ఆలయ ప్రహరీ లోపలగాని పొరపాటున కూడా ఉండరు. అదేవిధంగా పగలంతా ఆ ప్రాంతంలో చిత్ర, విచిత్ర శబ్దాలు చేస్తూ సంచరించే వివిధ రకాల పక్షులు, రాత్రి గంటలు కాగానే నిశ్శబ్దంగా ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోతారు

ఈ ఆలయానికి ఎదురుగా ఉండే గృహాల వారు, ఆ ఆలయంలో సాయంత్రం హారతి ఇస్తున్నప్పుడు మ్రోగించే గంట శబ్దం వినపడగానే, తమ ఇంటి యొక్క కిటికీ తలుపులు మూసివేస్తారు. ఎందుకంటే, ఆ కిటికీ తలుపులు తెరిస్తే - ఎదురుగా ఉండే నిధివన్ ఆలయం కనిపిస్తుందని లేదా నిధివన్ ఆలయ ప్రహరీ లోపల రాత్రి సమయంలో జరిగే "రాసలీల" కనిపిస్తుందని ఆ గృహాలలోని వ్యక్తులు భయపడతారు ఎందుకంటే, ఆ రాసలీలను కళ్ళతో చూసే ఏ మనిషి, ఆపై మామూలుగా బ్రతకటం , సాధ్యం కాదని

 ఆ ప్రాంతం వ్యక్తులు కు చాలా స్పష్టంగా తెలుసు. ఇంకొక విశేషం సాధ్యం కాదని ఆ ఏమంటే, ఎప్పుడూ ఈ ప్రదేశంలో విచ్చలవిడిగా తిరిగే కోతులు, రాత్రి కాగానే ఆ చుట్టు ప్రక్కల ఉండే ప్రదేశాలకు వెళ్ళిపోతాయి. అనగా, రాత్రి సమయంలో ఈ ఆలయ ప్రహరీ లోపల ఒక్క కోతి కూడా కనపడదు.



గత ఐదువేల సంవత్సరాలుగా ఈ నిధి వ లయ పరిసరాలలో మహాద్భుతమైన రాసలీల” జరుగుతున్నదని చెబుతున్నారు. రాత్రి సమయంలో గోలోకం నుండి రాధ మరియు శ్రీకృష్ణుడు ఈ క్షేత్రంలోకి దిగి వస్తారని, సరిగ్గా అదే సమయంలో ఇప్పటి వరకు ఆ పరిసరాలలో తులసి చెట్టు రూపంలో ఉన్న గోపికలు, మానవ రూపం ధరించి ఆడి, పాడతారని చెప్పుకుంటారు. రాత్రి 11.30 దాటిన తరువాత కృష్ణుడు మరియు ఇతర గోపికలు రాసలీల చాలిస్తారు. అప్పుడు, శ్రీకృష్ణుడు, రాధతో కలిసి 'రంగమహల్' అనే పేరుగల ఒక ప్రత్యేకమైన గదిలోకి వెళతాడు. అక్కడ తమకోసం సిద్ధంగా ఉంచిన మధుర పదార్థాలను ఆరగించి, ఆపై అక్కడ ఉన్న అలంకరించిన పడకమీద తన ప్రియురాలైన రాధతో కలిసి సుఖిస్తాడని చెప్పుకుంటారు సూర్యోదయానికి 3 గంటల ముందు శ్రీకృష్ణుడు మరియు రాధ ఆ రంగ మహల్ నుండి తమ లోకానికి వెళ్ళిపోతారు. ఇక, అప్పటి వరకు మానవ రూపంలో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న గోపికలు, చెట్లు రూపంలోకి మారిపోయి నిలబడతారు

అనేకమంది భారత మరియు పాశ్చాత్య రచయితలు మరియు పరిశోధకులు ఈ నిధివన్ క్షేత్రం యొక్క మర్మం ఏమిటో? - బైట పెట్టాలని ఈ క్షేత్రానికి వెళ్ళి ఎన్నో రోజులపాటు ఇక్కడ ఉండి పరిశోధనలు చేసారు. కానీ, వాళ్ళకి ఈ క్షేత్రానికి సంబంధించిన ఏ చిన్న రహస్యం కూడా తెలియలేదు


నిధివన్ ఆలయం చుట్టు ప్రక్కల ఉండే వన తులసి చెట్టు, చిన్న పరిమాణంలో ఉండటమే కాకుండా ప్రతి రెండు చెట్లు ఒకదానిని ఒకటి పెనవేసుకుని ఉంటాయి రాత్రి సమయంలో మానవ రూపాన్ని ధరించే గోపికలు, పగటి సమయంలో ఇలా చెట్ల రూపంలో ఉంటాయని ఈ క్షేత్రంలో చెప్పుకుంటారు. ఇంకొక విశేషం ఏమిటి ఈ చెట్లపైన పక్షులు వాలవు. అంతేకాదు, ఈ చెట్లపైన ఏవిధమైన పక్షి గూళ్ళు ఉండవు. ఈ చెట్లపైన ఏవిధమైన కీటకాలు కనిపించవు. ఒక విచిత్రం ఏమంటే, ఈ అరణ్యంలో ఉండే వన తులసి చెట్టు యొక్క కాండాలు
గుల్లలాగా ఉంటాయి. అంతేకాకుండా, వీటి యొక్క వేళ్ళు పైకి కనిపిస్తూ ఉంటాయి.
 చెట్లకు ఎవరూ నీళ్ళు పొయ్యరు. అయినప్పటికీ, వీటి ఆకులు సంవత్సరం అంతా పచ్చగానే కనిపిస్తాయి. రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు సంచరిస్తున్న కారణంగానే, ఈ సారంలేని భూమిలో పచ్చని చెట్లు ఉన్నాయని భావిస్తున్నారు
ఇంకొక విచిత్రం ఏమంటే, సాయంత్రం వరకు చెట్ల రూపంలో ఉన్న గోపికలు, రాత్రి కాగానే, మానవ రూపం ధరించి ఈ ప్రాంతంలో నృత్యాలు చేస్తారు. అయితే తెలవారే సమయానికి ఆ గోపికలు మళ్ళీ చెట్టు మారతారు. ఇక్కడ చెప్పుకోలసిన విషయం ఏమంటే, ఈ చెట్లు - తాము ఉన్న ప్రదేశాలను తరచుగా మారుస్తూ ఉంటాయి. అందువలన, ఈ రోజు ఒకచోట ఉన్న చెట్లు, మూడు రోజుల తర్వాత అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఇంకొక ప్రదేశంలో కనిపిస్తాయి. అందుకు కారణం ఏమంటే, చెట్లు, గోపికలుగా మారిన తరువాత, మళ్ళీ ఇంకొక ప్రదేశంలో మళ్ళీ చెట్టుగా మారి నిలబడటం జరుగుతుంది. ఈ విషయం నిజమా? కాదా? - అన్న విషయాన్ని తేల్చుకోవటం కోసం - కొందరు వ్యక్తులు, ఈ ప్రాంతంలోని నాలుగైదు చెట్లు ఎంపికచేసుకుని, వాటికి ఎరుపురంగు దారాలు కట్టారు. అలా కట్టిన మూడు రోజుల తరువాత అక్కడకు వచ్చి చూసిన వారికి, వాళ్ళు దారాలు కట్టి వెళ్ళిన చెట్లు మొదట ఉన్న చెట్లు ఉండకుండా, అక్కడికి ఒక 20 చెట్ల అవతల కనిపించాయి ఈ క్షేత్రంలో చెట్లు తరచుగా ఒకచోట నుండి ఒకచోటకి వెళ్ళిపోతాయి - అని నిరూపించే ఒక ఆధారం ఇక్కడ కనిపిస్తుంది. అది ఏమిటంటే... ఈ ప్రదేశంలో దాదాపు 1600 రంధ్రాలు నేలమీద కనిపిస్తాయి. ఆ రంధ్రాలలో ఉన్న చెట్లు ఇంకొక ప్రదేశానికి ఏదో ఒక సమయంలో వెళ్ళిపోయినట్లుగా గుర్తిస్తారు

రాధాకృష్ణుల శృంగార “రంగ మహల్" : ఈ ఆలయం లోపల, “రంగ మహల్" అనే పేరుగల ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది. ఆ గది మధ్యభాగంలో - గంధపు చెక్కతో చేయబడిన మరియు అందంగా అలంకరించిన ఒక మంచం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని మూసివెయ్యటానికి ముందు ఆ ఆలయ పూజారులు ఆ గదిలో అనేక రకాల మధుర పదార్థాలు, పూలు లాంటివి ఉంచుతారు. అంతేకాదు, రాత్రి సమయంలో ఆ గదిలోకి ప్రవేశించే రాధాదేవికి ధరించటంకోసం కొత్త చీరలు, గాజులు ఉంచుతారు. ఇంకా, ఆ రాధాకృష్ణులు తాంబూలం సేవించడం కోసం తమలపాకులు, సున్నం, వక్కలు ఉంచుతారు. ఇంకొక విశేషం ఏమంటే, తెల్లవారుఝాము సమయంలో - ఆ గదిలో నుండి వెళ్ళబోతున్న

రాధాకృష్ణులు, దంతధావనం చెయ్యడంకోసం వేప పుల్లలు, పాత్రలలో నీరు ఉంచుతారు. తెల్లవారిన తరువాత ఆలయ పూజారులు ఆలయాన్ని తెరచి, ఆపై రంగమహల్ గదిని తెరచి చూసినప్పుడు ఆ గదిలో - నేలంతా చిందరవందరగా పడిన పూలు, మంచంమీద ఉన్న పాత్రలో సగం తిని వదిలేసిన మధుర పదార్థాలు కనిపిస్తాయి. అంతేకాదు, ఆ మంచంమీద వేసిన పరుపు కూడా కొంచెం నలిగిపోయి కనిపిస్తుంది. అనగా, రాత్రి సమయంలో ఎవరో వ్యక్తులు ఆ పడకమీద పడుకుని లేచినట్లుగా కనిపిస్తుంది అన్నమాట


నాస్తికులకు, హేతువాదులకు అంతుచిక్కని నిధివన్ మర్మం :  కొందరు నాస్తికులు, తీవ్రమైన క్రూర చర్యలకు కూడా పాల్పడుతున్నారు. చివరగా, ఆ నాస్తికులు అకాల మృత్యువు పాలు కావటము లేదా తీవ్రమైన వ్యాధులకు గురై నీచమైన మరణాన్ని పొందటమో జరుగుతూ ఉంటుంది. ఏదిఏమైనా, భారతదేశానికి చెందిన కొందరు హేతువాదులు, “నిధివన్ లో దేవుడు లేడు" అని నిరూపించడం కోసం రాత్రి సమయంలో రహస్యంగా ఆ ఆలయ ప్రహరీ లోపల సంచరించారు. అయితే వాళ్ళకి దేవుడు కనపడలేదు. కానీ, ఆ దేవుని ఉనికి అబద్దం అని నిరూపించాలని ప్రయత్నించిన వాళ్ళకి కళ్ళుపోవటం, మతిచెడిపోవటం లాంటివి జరిగాయి. కొంతమంది ఆధునిక హేతువాదులు, చాలా రహస్యంగా ఆ ఆలయం లోపల నిఘా కెమెరాలు" అమర్చి, ఆపై ఉదయంపూట వచ్చి ఆ కెమెరాలను పరిశీలించినప్పుడు ఆ కెమెరాలకు దట్టమైన చీకటి కనిపించినట్లుగా వాళ్ళకు తెలిసింది. “ఆ దైవం అనుగ్రహం ఉండటం వల్లే మనిషి ఏదైనా చూడగలిగే శక్తిని కలిగి ఉంటాడు. అలాంటి దేవుని చూసే శక్తి - మనుషులు ఏర్పాటుచేసే నిఘా కెమెరా కి ఉంటుంది?" కొంతకాలం క్రితం, ముగ్గురు యువకులు రాత్రి సమయంలో నిధివన్ ఆలయ పరిసరాలలో రాధాకృష్ణులు మరియు గోపికలు ఆడుతూ, పాడుతూ చేసే లీల' గురించి స్వయంగా తెలుసుకోవాలని భావించి, సాయంత్రం - ఆ ఆలయాన్ని చూసే లోపే ఆలయ ప్రహరీ లోపలికి వెళ్ళిపోయి, ఆపై అక్కడ ఉన్న ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నారు. సమయం కాగానే పూజారులు ఆ ఆలయానికి తాళంవేసి వెళ్ళిపోయారు. సరిగ్గా, రాత్రి 10 గంటల కాగానే ఆ ప్రాంతంలో గజ్జల మోతలు వినపడ్డాయి. ఆపై, శ్రీకృష్ణుడు మరియు రాధ, ఇతర గోపికలు ఆ ప్రదేశంలో ప్రత్యక్షం అయి, ఉల్లాసంగా నృత్యం చెయ్యటం ప్రారంభించారు. వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా ఒక ప్రత్యేకమైన ప్రకాశంతో మెరిసిపోతూ కనిపించింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఈ ముగ్గురు యువకులు భయంతో వణికిపోయారు. అరవటానికి వాళ్ళ గొంతు కూడా సహకరించలేదు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు, క్షణాల్లో స్పృహతప్పి నేలపై పడిపోయారు. మర్నాడు ఉదయం ఆ ఆలయ పూజారులు తాళాలు తీసి ఆపై ఆలయం దగ్గరకు వచ్చి చూడగా, అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న ఈ ముగ్గురు యువకులూ కనిపించారు. ఆ తరువాత ఆ ఆలయానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ ముగ్గురు యువకులను తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. వాళ్ళలో ఇద్దరు యువకులకు తీవ్రమైన ఉన్నది వచ్చింది. మూడవ యువకుడు, నిన్నరాత్రి నిధివన్ ఆలయ పరిసరాలు తనకి "శ్రీకృష్ణుడు - రాధ మరియు ఇతర గోపికలతో సాగించిన రాసలీల తన కనిపించింది" వణుకుతన్న స్వరంతో ఇతరులకు చెప్పాడు. ఒకవిశేషం ఏమంటే, ఆ హాస్పిటల్ లో చేరిన మూడవ రోజే ఆ యువకుడి యొక్క కళ్ళు పోయాయి

2017 లో బృందవన్ లో స్వామిని ధ్యానించి, నిధివనం లో స్వామి ధ్యానం, జపం లో ఉండగా స్వామి మరియు రాధా అనుగ్రహం లభించింది ,  తరువాత చేసిన కృష్ణ హోమము లో కృష్ణడు తో పాటు గరుడ సాక్ష్యాత్తుకారం అయ్యి స్వామి అనుగ్రము ని కలిగించారు
కృష్ణ మంత్రం చేసిన యెడల జీవితం లో అద్భుత మార్పులు జరుగును రాధ దేవి అనుగ్రము తో సుసాధ్యం అయిన సమస్యలని కూడా కృష మంత్రం ఉపాసన తో రాధ దేవి తీరుస్తుంది , ఎందరో కృష్ణ మంత్రం తీసుకొని వాళ్ళ అనుభూతులు తెలియచేసారు
మంత్రం నిష్ఠగా ,ప్రేమ గా, శ్రద్ధ గా చేయాలి
ముఖ్యం గా ఈ సాధన లో కావలసింది ప్రేమ , కృష్ణడు అంటే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ తీవ్ర స్థాయిలో లో ఉండాలి






Popular posts from this blog

Ketu Graha -కేతు తత్త్వ సాక్షాత్కారం- poojanilyam

కేతు తత్త్వ సాక్షాత్కారం                                                            కేతు తత్త్వ సాక్షాత్కారం                                                             కేతు తత్త్వ సాక్షాత్కారం                                                              కేతు తత్త్వ సాక్షాత్కారం                                                              కేతు తత్త్వ సాక్షాత్కారం       ...

వివాహ పొంతన కోసం సంపూర్ణ వివరణ: వివాహ పొంతన ఏలా చూడాలి ? అష్ట గుణ కూటమి గురించి సంపూర్ణ వివరణ - marriage compatibility - Poojanilayam

 వివాహ పొంతన కోసం సంపూర్ణ వివరణ:  వివాహ పొంతన ఏలా చూడాలి ?  అష్ట గుణ కూటమి గురించి సంపూర్ణ వివరణ -  marriag e compatibility - Poojanilayam

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు - Poojanilayam

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు. ఏ కార్యాన్ని అయిన అవలీలగా చేసే శక్తి ఈ యంత్రాల కి ఉన్నది