Skip to main content

అతిశక్తివంతమైన మహా దుర్గమంత్రం సాధన తో పాటు అష్టమి తిది యొక్క ప్రాముఖ్యత - poojanilayam

అతిశక్తివంతమైన మహా దుర్గమంత్రం సాధన తో పాటు అష్టమి తిది యొక్క ప్రాముఖ్యత మరియు సంపూర్ణ వివరణ  ఈ మంత్రం అష్టమి తిది రోజు ప్రారంభించి 41 రోజులు సాధన చేయవలెను



ఈ మంత్ర సాధన వలన ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు ని అయిన తొలగొంచి సాధకుడికి అనుకూల వాతావరణం కలుగచేయును , సకల బాధలు , కష్టములు నివారణ అగును , మనోవాంఛలు తీరును,శత్రు బాధలు పోవును  ,
శీగ్రము గా అమ్మవారి అనుగ్రము పొందుతారు


సాధన రోజుకి 324 లేదా మీ శక్తి కొలది 1080 సార్లు వరకు చేయవచ్చు
ఇలా 41 రోజులు దీక్ష గా చేయవలెను
 అష్టమికి ఉపవాసం ఉండి పాలు పండ్లను తీసుకొని ఆహారం గా  ఈ మంత్రం 1700 సార్లు పారాయణం చేసి ప్రారంభించి ఇంక రోజు నీ శక్తి కొలది 324 లేదా 1080 సార్లు చేయవలెను

గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు
చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి



అష్టమి తిధి గురించి చాలా భయం - హైందవులలో వ్యాపించి ఉన్నది అన్నమాట వాస్తవం. అయితే, తంత్రశాస్త్రంలో అష్టమికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ తిథినాడు చేసే కొన్ని కార్యాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి చెప్పబడింది. అది ఎలాగంటే

జ్యోతిష మరియు తంత్రశాస్త్రాలలో చెప్పబడిన సమాచారం ప్రకారం చూసినట్లయితే, ధైర్యం మరియు సాహసం అవసరమైన కార్యాలకు అష్టమి తిధి చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తున్నది. ఈ తిధి రోజున మనిషి శరీరంలో శక్తి విపరీతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా, మనిషిలో ధైర్యం పెరిగిపోతుంది. ఏ సమస్యనైనా సరే, ఎదుర్కొనే పట్టుదల, సాహసం ఏర్పడతాయి

ఎవరైనా వ్యక్తి, తమ శత్రువుల్ని జయించాలి అనుకుంటే అందుకు అష్టమి తిథి మహా యోగ్యంగా ఉంటుంది. శత్రువులను ఓడించడం కోసం వ్యూహాలను ప్రయోగించే కార్యక్రమం అష్టమి తిథినాడు ప్రారంభిస్తే తప్పనిసరిగా శత్రువులను ఓడించటం జరుగుతుంది

అమావాస్య తిథి నాడు - సూర్య, చంద్రులు ఒకే డిగ్రీ మీద, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సున్నా డిగ్రీ మీద ఉంటారు. దీనినే "సూర్య చంద్రుల యుతి” లేదా సమాగమము అని పిలుస్తారు. ఎవరి జాతక చక్రంలో అయినా ఇలాంటి గ్రహస్థితి ఉంటే అది ఆ జాతకులకు మంచిది కాదని, అనగా, ఆ జాతకులకు రవి, చంద్రుల బలం సరిగ్గా అందదని చెబుతారు

అష్టమి తిధినాడు, సూర్య మరియు చంద్రుల మధ్య “చతురస్రం దృష్టి” (స్క్వేర్ యాస్పెక్ట్) ఉంటుంది. జ్యోతిషశాస్త్ర సిద్ధాంతాల రీత్యా చూసినట్లయితే ఈ రెండు గ్రహాల మధ్య - చతురస్ర దృష్టి మంచిదికాదు. అందువల్ల అష్టమి తిథి మంచిది కాదని

సూర్య మరియు చంద్రుల మధ్య చతురస్ర దృష్టి అనగా, ఈ రెండు గ్రహాలు ఉండే స్థానాల మధ్య రెండు రాశుల తేడా లేదా ఎడం ఉంటుంది.  చైత్ర మరియు మార్గశిర మాసాలలో వచ్చే "శుక్ల అష్టమి తిథి మాస శూన్య తిథి” అని పేర్కొంటారు. ఈ తిధి చాలా అశుభకరమైనది అని చెబుతారు. ఈ
తిధినాడు ప్రారంభించే పనులు విజయవంతం అవటం అసాధ్యం అని గుర్తించాలి.

శుక్ల అష్టమినాడు పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నట్లయితే దానిని "దగ్ధతిధి" అని పిలుస్తారు. ఈ తిధినాడు రవిగ్రహం, మిధున లేదా కన్య రాశి గుండా ప్రయాణిస్తుంది. కనుక, ఈ తిధిని దహనమైన తిథి అనగా చెడు తిథి గా గుర్తిస్తారు.

మంగళవారంనాడు అష్టమి తిథి ఉన్నట్లయితే ఆ తిథిని "సిద్ధ యోగం" అనే పేరుతో పిలుస్తారు. అయితే, బుధవారంనాడు అష్టమి తిథి ఉన్నట్లయితే ఆ యోగాన్ని మృత్యు యోగం" అని పిలుస్తారు. అనగా, ఇది చాలా అశుభమైన తిధి అని గుర్తించాలి. శుక్లపక్ష అష్టమి తిధినాడు పొరపాటున కూడా మాంసాహారం సేవించరాదు

భారతదేశంలోని హైందవులు అష్టమి తిధినాడు వివిధ రకాల దైవాలను ఆరాధించం జరుగుతున్నది. అది ఎలాగంటే..

పరమశివుడికి మూడు నేత్రాలు ఉంటాయి. అందువలన ఆయనను త్రిలోచనుడు” అని పిలుస్తారు. ఒరిస్సా మరియు కొన్ని ఇతర ప్రాంతాలలో అష్టమి తిధినాడు శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ కారణంగా, ఆ అష్టమి "త్రిలోచనాష్టమి" అని పిలుస్తారు. ఇంకొక ముఖ్య విశేషం ఏమంటే, పరమశివుడిని కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిధినాడు పూజించాలి. (శుక్లపక్షంలో కాదు అని గుర్తించాలి.) పరమశివుడి యొక్క ఉగ్రూపం అయిన భైరవుడు మార్గశిర మాసంలో వచ్చే

కృష్ణపక్ష అష్టమి తిధినాడు పూజిస్తారు. ఈ అష్టమి "భైరవాష్టమి” అనే పేరుతో

పిలుస్తారు మహాలక్ష్మి స్వరూపం అయిన రాధాదేవి, భాద్రపద మాస, శుక్లపక్ష అష్టమి తిథినాడు ఈ భూమిపై ఆవిర్భవించిందని విశ్వసిస్తారు. ఆ కారణంగానే, ఆమే జన్మ దినాన్ని రాధష్టమి

అనే పేరుతో పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోని బృందావన్, బర్సాన, రాధాష్టమి" ని లాంటి పవిత్ర క్షేత్రాలలో ఈ రాధాష్టమి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు

ఫాల్గుణ మాసం కృష్ణపక్ష అష్టమి తిధినాడు సీతాదేవి అవతరించిందని, అనగా రోజు జనకమహారాజుకి పసిబిడ్డ రూపంలో ఆమె కనిపించిందని పురాణ గ్రంధాలలో చెప్పబడి ఉన్నది. ఆ కారణంగా ఆ రోజున సీతాష్టమి/జానకీ జయంతి ఎంతో వైభవంగా జరుపుకుంటారు

కార్తికమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథినాడు "అనసూయ మాత" అనే దేవతని పూజిస్తారు. ముఖ్యంగా, తమ బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకునే తల్లులు ఈ దేవతని ఆరాధిస్తారు. ఆ కారణంగానే ఈ అష్టమి "ఆహుయ్ అష్టమి" అనే పేరుతో పిలుస్తారు. ఈ తిధి రోజున తల్లులు, రోజంతా ఉపవాసం ఉండి, ఆ దేవతని ఆరాధిస్తూ, సూర్యాస్తమయం దాకా కాలం గడుపుతారు. ఆపై ఆకాశంలో నక్షత్రాలు కనపడిన తర్వాత ఉపవాసాన్ని ముగిస్తారు. ఉత్తర భారతదేశంలో అదే అష్టమి వ్రతం చాలా వైభవంగా జరుపుకోబడుతుంది

చైత్రమాస కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిధినాడు "శీతల మాత” అనే ఒక దుర్గా రూపాన్ని ఆరాధిస్తారు. ఆ కారణంగానే ఈ అష్టమి “శీతల అష్టమి" అనే పేరు వచ్చింది. ఈ రోజున శీతల మాతను ఉపవాసం ఉండి పూజించటం బిడ్డల తల్లులకు ఒక సాంప్రదాయంగా వస్తున్నది. తమ పసిబిడ్డలు, ఆటలమ్మ, మసూచి లాంటి అంటు వ్యాధులకు గురికాకుండా ఉండటానికి మరియు మంచి ఆరోగ్యంతో ఉండటానికి తల్లులు ఈ శీతల మాతను ఆరాధిస్తారు

దుర్గాదేవిని ఆరాధించే నవరాత్రుల సమయంలో అష్టమి తిధినాడు 'సంధి పూజ" అనే తాంత్రిక పూజను ఉత్తర భారతదేశంలో అధికంగా ఆచరిస్తారు. అష్టమి తిధి ముగిసే సమయంలో మరియు నవమి తిధి ప్రారంభం అయ్యే సమయంలో అనగా అష్టమి నవమి తిధుల సంధికాలంలో దుర్గాదేవికి "బలిదానం" చేస్తారు పూర్వకాలంలో ఆ సమయంలో దుర్గాదేవికి దున్నపోతుల్ని, మేకల్ని, కోళ్ళను బలి ఇవ్వడం జరిగేది. కానీ, మారిన సామాజిక పరిస్థితుల దృష్ట్యా బలులకు బదులుగా గుమ్మడికాయ పగలగొట్టి అమ్మవారికి బలి ఇవ్వటం జరుగుతున్నది

మహాగౌరి అవతారం అష్టమినాడు ఆవిర్భవించిందని చెబుతారు. నవరాత్రులు వ రోజున దుర్గాదేవి అవతరించిన కారణంగా ఆ తిథిని మహా అష్టమి లేదా మహా దుర్గాష్టమి అన్న పేరుతో పిలుస్తున్నారు
నవరాత్రులలో వచ్చే అష్టమి తిథినాడు ఆయుధాలకు పూజ చేయటం జరుగుతుంది. ఆ కారణంగానే ఈ రోజుని "వీరాష్టమి" అన్న పేరుతో పిలుస్తున్నారు

#poojanilayam

Popular posts from this blog

Ketu Graha -కేతు తత్త్వ సాక్షాత్కారం- poojanilyam

కేతు తత్త్వ సాక్షాత్కారం                                                            కేతు తత్త్వ సాక్షాత్కారం                                                             కేతు తత్త్వ సాక్షాత్కారం                                                              కేతు తత్త్వ సాక్షాత్కారం                                                              కేతు తత్త్వ సాక్షాత్కారం       ...

వివాహ పొంతన కోసం సంపూర్ణ వివరణ: వివాహ పొంతన ఏలా చూడాలి ? అష్ట గుణ కూటమి గురించి సంపూర్ణ వివరణ - marriage compatibility - Poojanilayam

 వివాహ పొంతన కోసం సంపూర్ణ వివరణ:  వివాహ పొంతన ఏలా చూడాలి ?  అష్ట గుణ కూటమి గురించి సంపూర్ణ వివరణ -  marriag e compatibility - Poojanilayam

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు - Poojanilayam

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు. ఏ కార్యాన్ని అయిన అవలీలగా చేసే శక్తి ఈ యంత్రాల కి ఉన్నది