రాత్రి సమయాలలో ఈ నాటికీ రాధా కృష్ణులు , సంచరిస్తున్న “నిధివన్" క్షేత్రము కోసం సంపూర్ణముగా - poojanilayam
రాత్రి సమయాలలో ఈ నాటికీ రాధా కృష్ణులు , సంచరిస్తున్న “ నిధివన్ " క్షేత్రము కోసం సంపూర్ణముగా ఈ “ నిధివన్ ” అనే ఆలయం పేరు - "నిధి” (నిద్ర) మరియు “వన” (అడవి) అనే రెండు పేర్ల కలయికతో ఏర్పడింది. అనగా, ఈ అరణ్యంలో రాత్రిపూట నిద్ర ఉండదని, ఈ ప్రాంతంలో రాధాకృష్ణులు మరియు గోపికలు - మెళుకువతో ఉండి రాసలీల సాగిస్తారని భావిస్తారు. నిగూఢమైన మర్మాలతో కూడి ఉన్న ఈ “నిధివన్ ఆలయం, బృందావన్ పట్టణ మధ్యభాగంలో ఉన్నది. మొదట, బృందావన్ పట్టణం గురించి తెలుసుకుని ఆ తరువాత అక్కడ ఉన్న “నిధివన్" ఆలయం గురించి చెప్పుకోవలసి ఉంటుంది ప్రాచీనకాలంలో ఈ పట్టణాన్ని “బృందావనము” అనే పేరుతో పిలిచారు. బృంద (తులసి) అని, వన అనగా వనం లేదా అరణ్యం అని అర్ధం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక దట్టమైన అడవిగా ఉన్న బృందావనం ఈనాడు అనేక వేల యాలకు నిలయంగా మారింది. ఫలితంగా, రోజుకి కొన్ని వేల మంది హిందూ భక్తులు ఈ పట్టణానికి వచ్చి, ఆపై ఇక్కడ ఉన్న అనేక ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఒకవిశేషం ఏమంటే, బృందావన్ పట్టణంలోని ప్రతి సందులోనూ ఒక ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రంలో దాదాపుగా 5500 ఆలయాలు ఉన్నట్లు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోన...