షట్చక్రాలని ఉత్తేజపరిచి మొఖం లో ఆకర్షణ శక్తి ని పెంచే 27 సుగంధలతో తయారు చేసిన శ్రీగంధం
సుగంధ ద్రవ్యాలు తో తయారు చేసిన శ్రీ గంధం
పూజల కి ,తిలక ధారణ కి , కామ్య హోమాలు కి ఉపయోగించవచ్చు మొదలగు పూజ కార్యక్రమలకి ఈ శ్రీ గంధం ని ఉపయోగించవచ్చు
ఈ గంధం ధరించడం వల్ల ఆజ్ఞ చక్ర శుద్ధి తో పాటు మొఖం లో తేజస్సు వస్తుంది , స్త్రీ ,పురుషలకి ప్రత్యేకం గా మొఖం లో ఆకర్షణ శక్తి ని పెంచుతుంది ఈ సువాసన 24గంటలు వెదజల్లుతూ ఉంటుంది ,షట్ చక్రాలలో ఉత్తేజం కలిగిస్తుంది
ఈ శ్రీగంధం ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ, వారణాసి, అస్సాం ,కేరళ ,తమిళనాడు, మొదలగు ప్రముఖ పీఠాలకి ,పూజల కి ,యాగాలకి , తిలకధారణ కి ఉపయోగిస్తున్నారు
ఈ శ్రీ గంధం 27 సుగంధ ద్రవ్యాలు తో తయారు చేసిన
అతి శక్తివంతమైన గంధం
ఈ.క్రింద వస్తువులతో శ్రీ గంధాన్ని తయారు చేస్తారు : -
శ్రీగంధం ,నాగకేసరాలు ,బిల్వగుజ్జు , పాలసుగంధి , జాపత్రి, జాజికాయ , ఎలాచి ,జటామాంస , బావంచాలు , పచ్చ కర్పూరం ,కుంకుమ పువ్వు , కోష్టం ,తుంగదుంపలు , గంధ కచోరాలు ,
ఎర్ర చందనం , కస్తూరి పసుపు , ఒట్టివేళ్ళు , జవ్వాజి , కురువేళ్ళు , దేవదారు , వస , గులాబీ రెక్కలు , సంపంగి ,విరజాజి , కృష్ణతులసి , తాలిసపత్రి ,
రుద్రజడ,
ఈ ప్రత్యేకమైన శ్రీగంధం కోసం
లలితా దేవి సహస్ర నామాలలో "చందన ద్రవ దిగ్ధాంగీ" అని ఒక శ్లోకం ఉంది. మొత్తం శరీరమంతా చందన ద్రవంతో ముంచెత్తినది అని అర్థం. అంటే అమ్మవారికి కూడా చందనం అంటే అంత ఇష్టం అన్నమాట.
అలంకార ప్రియుడైన విష్ణు మూర్తికి చందనం తయారు చేయటానికి పెద్ద వ్యవస్థే ఉంది వైకుంఠం లో. చందనం అంటే గంధపు చెక్కని అరగదీస్తే వచ్చే కలికం. ఇది మన వంటి కలికాలంలో ఉన్న కొందరి మనుషులకి మాత్రమే వర్తిస్తుంది ఎందుకు అంటే గంధం తయారు చేయటం ఒక విద్య . విష్ణుమూర్తికి చందనం తయారు చేయటానికి ఒక పెద్ద వ్యవస్థే ఉంది! గంధపు చెక్క అరగదీయగా వచ్చిన గంధం మూలం.
అసలు అరగదీసేప్పుడే మామూలు నీరు కాక పన్నీరు పోస్తారు. అందులో వేసవి కాలం అయితే పచ్చ కర్పూరం మొదలైన వాటిని అధికంగా చేర్చుతారు. చలి కాలం అయితే కస్తూరి ఎక్కువగా చేర్చటం ఉంటుంది. పునుగు, జవ్వాది, వట్టి వేళ్ళు, బావంచాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు గంధంలో చేర్చ బడుతూ ఉంటాయి. సంధర్భాన్ని పట్టి వీటి పాళ్ళు మారుతూ ఉంటాయి.
విష్ణువు ఉపయోగించే చందనం చాలా ప్రత్యేక మైనది, విలక్షణమైనది. తుంబురుని గానాన్ని, వీణా వాదనని మెచ్చిన విష్ణువు అతడిని సత్కరించి ఇచ్చిన హారము, మెరుగు బంగరు వస్త్రము, కన్న నారదునిలో మాత్సర్యాన్ని రగిల్చింది అతడికి విష్ణు మూర్తి తను ఉపయోగించే చందనం పూయటమే! దానికున్న విశిష్టత మాత్రమే కాదు చందనం పూయటం వెనుక ఉన్న గౌరవం నారదునికీ అసూయ కలగటానికి కారణ మయ్యింది.
శ్రీ కృష్ణుడు కంసుని ఆహ్వానంపై మథురా నగరంలో ప్రవేశించే సమయంలో అడగగానే లేపనాలిచ్చిన త్రివక్రను వంకర తీర్చి అనుగ్రహించాడు. అప్పుడు కుబ్జ తన గురించి చెప్పుకుంటూ " వినిర్మల లేపన విద్య దాన" అంటుంది. అంటే లేపనాలు తయారు చెయ్యటం ఒక ప్రత్యేకమైన విద్య. ఏదో మొక్కు బడిగా గంధపు చెక్కని అరగదీయటం కాదు.
చందనానికి ఇంతటి ప్రాముఖ్యం ఎందుకు?
చందనం అమూల్యమైన మూలిక. ఆహ్లాదకరమైన వాసన కలిగిఉంటుంది.
దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. ఇది విషాన్ని హరిస్తుంది. క్రిమిహరం కూడా! చల్లగా ఉంటుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. అని చాలా మందికి తెలుసు. అంతే కాదు చందనం అంతస్తాపాన్ని కూడా హరిస్తుంది. ఆ కారణంగానే చందనాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు. చందనాది వటి, చందనాసవం మొదలైన ఔషధాలు తయారు చేస్తారు. చాందినీ అత్తరు, సబ్బులు మొదలైన సౌందర్య సాధనాలకి మూలం చందనం.చందనాన్ని చాలా మంది ఆచార పరాయణులు , నుదుటికి, ఛాతీ మీద, జబ్బలకు రాసుకుంటారు.నుదుటిమీద రాసుకుంటే తలలో వేడి చేరకుండా తల నొప్పి రాకుండా రక్షణ నిస్తుంది. గుండెలపై రాసుకోవటం వల్ల హృదయానికి మేలు చేసి,గుండే జబ్బులు రాకుండా చూస్తుంది.
ఆడ వారు సాధారణంగా గంధాన్ని మెడకి, కొన్ని ప్రాంతాలలో దవడలకి రాసుకుంటారు. సాధారణంగా చెమట పట్టి చికాకు కలిగించే ప్రాంతాలు ఇవే. కంఠం ముడి ఉండే ప్రదేశంలో విశుద్ధి చక్రం ఉంటుంది. రెండు వేళ్ళతో ఆ ప్రాంతంలో గంధం పూయటం వల్ల విశుద్ధి చక్రం జాగృతి జరిగి ఉత్తేజం గా ఉంటుంది